దేశీయ విత్తనాలతో రాఖీలు ఆరోగ్యకరం ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ తో రాఖీలు వద్దే వద్దు..

0
10
  • దేశీయ విత్తనాలతో రాఖీలు ఆరోగ్యకరం, ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ తో రాఖీలు వద్దే వద్దు అని గ్రీన్ క్లైమేట్ టీం, వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం మధురవాడ లో సన్ ఫ్లవర్ విద్యా సంస్థ లో నిర్వహించిన దేశీయ విత్తనాలతో రాఖీ లు తయారు చేసే కార్యక్రమాన్ని గ్రీన్ క్లైమేట్ టీం చేపట్టింది.

  • ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ప్లాస్టిక్ రాఖీలు వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు పర్యావరణానికి హాని కలగకుండా విత్తనాలతో రాఖి లు తయారు చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలని అన్నారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించండి మీ కుటుంబీకులకు చెప్పండి:

  • ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రతి విద్యార్థి తమ కుటుంబీకులకు అవగాహన కలిగించాలని కోరారు. ద్విచక్ర వాహనాలు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు తమ కుటుంబంలో అందర్నీ ప్రమాదాలకు దూరంగా ఉండేలా చైతన్యపరచాలి అన్నారు.

  • విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ తిరునగరి సాయి ప్రకాష్ మాట్లాడుతూ విశాఖ మహానగరంలో పలు విద్యాసంస్థలు దేశీ విత్తనాల రాఖీలు తయారు చేయడం మీద శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ విత్తనాలు రాఖీలు మొలకెత్తుతాయి అని, విభిన్న కూరగాయలు పండించడం కోసం ఉపకరిస్తాయని. అన్నారు. విద్యార్థులంతా ఈ రాఖీ లు తయారు చేయడంపై శిక్షణ పొందాలని కోరారు.


సన్ ఫ్లవర్ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ కుమారి మాట్లాడుతూ తమ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ అంశాలమీద నిరంతరంగా శిక్షణ పొందుతున్నారు. ఇది ప్రతి విద్యా సంస్థ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థి దశలో పర్యావరణం పరిరక్షణ మీద అవగాహన కల్పిస్తే వారి ద్వారా వారి పిల్లలు కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ప్రతినిధులు జె రాజేశ్వరి, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here