ధరల నియంత్రణపై బాదుడే బాదుడు..

0
2

ధరల నియంత్రణపై బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించిన కందుల

తర్లపాడు మండలం లోని తాడివారిపల్లి గ్రామం పంచాయతీలోని “బాడుడే -బాదుడు ” కార్యక్రమం మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ చార్జీలు పెంచి, ఆర్టీసీ చార్జీలు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి, చెత్త పన్ను వేసి, ఓ టి ఎస్ పన్ను వేసి, ఇసుక సిమెంట్ ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి వివిధ రూపాల పన్నులు రూపం లో ప్రజల పై వేసి ప్రజల రక్తం తాగుతున్నారని,నకిలీ మద్యం తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని జే బ్రాండ్ మద్యం తో ప్రజల ఆరోగ్యం, జేబులు గుల్ల అయ్యే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేసారు.

    మార్కాపురం జిల్లా  విషయంలో ఈ ప్రాంతాన్ని ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం నిలువునా దగా చేశారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా చేస్తానని తద్వారా రైతుల పొలాలు కోట్ల రూపాయలు ధర వస్తుందని తద్వారా రైతులను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చారు.
  వైసిపి ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి వెలుగొండ ప్రాజెక్టు లో భాగమైన మొదటి టన్నెల్ పూర్తయినా కూడా కాలువ ద్వారా నీటి విడుదల చేయకుండా రెండవ టన్నెల్ పూర్తయిన తరువాత నీళ్లు ఇస్తామని ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు అని ఎద్దేవా చేశారు.
   గత ప్రభుత్వ హయాంలో పార్టీలకతీతంగా పంట నష్టపరిహారం చెల్లించాం అని ఈ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో వందల సంఖ్యలో రైతులకు పంట నష్టపరిహారం చెల్లించకుండా రైతులను వేదిస్తున్నారని తెలియజేసారు. త్వరలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారని అవి రైతుల పాలిట ఉరి తాళ్లు గా మారబోతున్నాయి అని ఇకనైనా ఆ ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
   ప్రజలను జలగల్లా పీల్చే వైసీపీ ప్రభుత్వం కావాల లేక అభివృద్ధికి పాటుపడే తెలుగుదేశం ప్రభుత్వం కావాలా తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటరీ పార్టీఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య ,మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, మాజీ ఎంపీపీ ఎసుదాసు సాదం వీరయ్య,ఈర్ల.వెంకటయ్య రోడ్డ గురవయ్య, దొండపాటి చిన్న పెద్దిరాజు, తాడి.చలమారెడ్డి ,ఐ టి డి పి అధ్యక్షుడు శ్యాంప్రతాప్ వివిధ గ్రామాల తెలుగుదేశం నాయకులు,గ్రామ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here