ధర్మం వైపు నిలబడే జాతి గొల్ల కురమ జాతి : హరీశ్‌రావు

0
4

హైదరాబాద్‌: ధర్మం వైపు నిలబడే జాతి గొల్ల కురమ జాతి అని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు . నాడు న్యాయం, ధర్మం పాండవుల వైపు ఉన్నందునే శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టాడని చెప్పారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా సీఎం కేసీఆర్ గొల్ల కురమలను అభివృద్ధి చేశారని, వారిని ఆర్థికంగా నిలబెట్టారని మంత్రి తెలిపారు. గొల్ల కురమలలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకంటే ఎక్కువ తెలివి తేటలు ఉంటాయని గతంలో అసెంబ్లీలో సీఎం చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

మన్నెగూడలో జరిగిన యాదవ-కురమ సభలో మాట్లాడిన మంత్రి.. గొల్ల కురమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రె పిల్లలు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వంలో, చట్టసభల్లో గొల్ల కురమలకు భాగస్వామ్యం కల్పించారన్నారు. కర్ణాటకలో అప్పటి మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు రేవణ్ణ గొర్రెల స్కీమ్‌ గురించి తెలిసుకుని సీఎం కేసీఆర్‌ను అభినందించారని, హైదరాబాద్‌కు వచ్చి గొంగడి కప్పి, గొర్రెపిల్లను ఇచ్చి సన్మానించాడని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ నోటీసులు ఇచ్చినా రేవణ్ణ భయపడలేదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here