నంద్యాల జిల్లా లోదారుణ ఘటన..

0
6

తండ్రిని చంపారన్న కక్షతో.. నాయనమ్మని హత్య చేసిన మనవడు

ఆస్తి తగాదాల్లో తన తండ్రిని అన్యాయంగా చంపారన్న కక్షతో.. ఎంతో కాలం వేచి చూసిన మనవడు ఏకంగా నాయనమ్మనే హత్య చేశాడు. మనవడికి భయపడి చాన్నాళ్లు ఊళ్లోకే అడుగుపెట్టిన ఆమె గ్రామంలోకి వచ్చిందన్న సమాచారంతో గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి హత్య చేశాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

ఆస్తి తగాదాల్లో తన తండ్రిని అన్యాయంగా చంపారన్న కక్షతో.. ఎంతో కాలం వేచి చూసిన మనవడు ఏకంగా నాయనమ్మనే హత్య చేశాడు. మనవడికి భయపడి చాన్నాళ్లు ఊళ్లోకే అడుగుపెట్టిన ఆమె.. గ్రామంలోకి వచ్చిందన్న సమాచారంతో గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి హత్య చేశాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

బేతంచర్ల మండలం గొర్లగుట్ట గ్రామానికి చెందిన పలుకూరు నాగమ్మ (70)కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. తనకున్న మూడు సెంట్ల స్థలాన్ని ఇద్దరు కుమారులకు చెరో ఒకటిన్నర సెంట్ పంచి ఇచ్చింది. అయితే ఒక కుమారుడు తనకు పంచి ఇచ్చిన భాగాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాలని నాగతిమ్మయ్య ఈ ఏడాది ఫిబ్రవరి 5న తల్లితో గొడవ పడ్డాడు. ఈ గొడవలో తల్లి నాగమ్మ, మరో కుమారుడు నాగమద్దిలేటి స్వామి కలిసి నాగతిమ్మయ్యను రాయితో కొట్టి చంపేశారు.

ఈ హత్యకు నాగమ్మే కారణమని ఆమెపై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన నాగమ్మ.. ఊరికి వెళ్తే మనవడు చంపేస్తాడన్న భయంలో బేతంచెర్ల రైల్వేస్టేషన్‌లోనే ఉంటూ జీవిస్తోంది. అయితే, శనివారం రాత్రి గొర్లగుట్ట గ్రామంలోనే ఉన్న కూతురు నాగసుబ్బమ్మ వద్దకు వెళ్లింది. నాయనమ్మ ఊర్లోకి వచ్చిందన్న విషయం తెలుసుకున్న మనవడు మధుసూదన్.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నాగమ్మ తలపై రాయితో కొట్టి హత్య చేశాడు.

హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి మధుసూదన్ పారిపోయాడు. రక్తపు మడుగుల్లో ఉన్న తల్లిని చూసిన నాగసుబ్బమ్మ విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల హత్యకు కారణాలు తెలుసుకుని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here