నటుడు,ఎంపీ రవికిషన్‌పై నెటిజన్లు ఫైర్..

0
30

రేసుగుర్రం సినిమాలో విలన్, ఎంపీ రవి కిషన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెడతానని చెప్పడమే దానికి కారణం. నలుగురు పిల్లల తండ్రైనా ఆయన ఈ బిల్లును ప్రవేశపెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ముందు మీ సంగతి చూసుకోమంటూ హితవు పలుకుతున్నారు. ఆ బిల్లు ప్రకారం ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండకూడదు. ఒక వేళ ఉంటే చర్యలు తీసుకుంటారు.

నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌ను నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆయన ప్రవేశపెట్టబోతున్న బిల్లు దానికి కారణం. జనాభా నియంత్రణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. ఆ బిల్లు ప్రకారం ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండకూడదు. ఒక వేళ ఉంటే చర్యలు తీసుకుంటారు. ఆ బిల్లును ఆయన సభ ముందుకు తీసుకెళ్తున్న చెప్పారు. “జనాభా నియంత్రణ బిల్లులు తీసుకొచ్చినప్పుడే మనం విశ్వ గురువు అవుతాం. జనాభాను అదుపులోకి తీసుకురావడం చాలా ముఖ్యం. ఎందుకు ఆ బిల్లును ప్రవేశపెడుతున్నానో తెలియజేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలి.” అని రవి కిషన్‌ అన్నారు.

ఈ విషయంపై నెటిజన్లు రవికిషన్‌ను విమర్శిస్తున్నారు. ఆయనపై నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. ఎందుకంటే రవికిషన్‌కు నలుగురు పిల్లలు. ఇదే విషయంపై అందరూ గురిపెట్టి కామెంట్లు పెడుతున్నారు. నలుగురు పిల్లలకు తండ్రిగా ఉన్న రవికిషన్ ఈ బిల్లును ప్రవేశపెట్టడమేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. రవికిషన్‌కు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు.

రవికిషన్ ప్రవేశపెట్టే బిల్లు ప్రకారం దంపతులకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదు. అలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వం ఇచ్చే వివిధ సౌకర్యాలు, వస్తువులపై సబ్సిడీలకు అనర్హులవుతారు. ఇదిలా ఉండగా భారత్‌లో రోజురోజుకు జనాభా పెరుగుతుంది. 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్… చైనాను అధిగమిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2050 నాటికి భారతదేశ జనాభా 1.668 బిలియన్లకు పెరుగుతుందని అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here