నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు..

0
10

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేస్తున్న నవరత్నాల పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్నాయని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.

శనివారం సంగం మండలం సిద్దీపురం సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిద్దీపురంలో ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు లబ్దిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకుని వారికి ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వాలంటీర్లకు తమకు కేటాయించిన గృహాలలో సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే ఒక సర్వే పుస్తకం అందచేయడం జరిగిందని అన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్ సీపీ నాయకులు వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను సమన్వయం చేసుకుని ఆ సర్వేను పూర్తి చేసి ప్రజా సమస్యలను తెలుసుకుంటే సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా మనందరం కృషి చేయవచ్చునని పేర్కొన్నారు.

అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వారికి లభిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తెలుపుతున్న సైడ్ డ్రైన్లు, ఆధార్ లో తప్పుల సవరణ తదితర చిన్న చిన్న సమస్యలను అధికారులతో రివ్యూ ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కోరిక మేరకు అభివృద్ది పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సమస్యలు లేకుండా చూస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలోవైయస్సార్ సిపి నాయకులు,ఎంపీపీ రఘునాథ్ రెడ్డి,అధ్యక్షులుశంకర్ రెడ్డి,గుండాల బాలచంద్రారెడ్డి,సురా శ్రీనివాసులురెడ్డి,కర్నాటి రవీందర్ రెడ్డి,శంకరయ్య,ఆనం ప్రసాద్ రెడ్డి,సునీల్ కుమార్ రెడ్డి,మదన్ రెడ్డి,తాసిల్దార్ జయవర్ధన్,ఎం పి డి ఓ,ఈ ఓ పి ఆర్ డి అప్పాజీ,సీఐ వేణుగోపాల్రెడ్డి,ఎస్సై నాగార్జున రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here