నవీన్ చంద్రకు ముద్దు పెట్టిన శ్రీముఖి..

0
20

స్టార్ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ శ్రీముఖి ఓ ధైర్యం చేసేసింది. ఏకంగా స్టేజ్‌పై అంద‌రూ చూస్తుండ‌గానే హీరో న‌వీన్ చంద్ర‌కు ముద్దు పెట్టేసింది. అవును నిజ‌మే! ఇది చూసిన ఇత‌ర యూనిట్ స‌భ్యులు రాములమ్మ చేసిన ప‌నికి షాక‌య్యారు. అస‌లు న‌వీన్ చంద్ర‌ కు శ్రీముఖి ఎందుకు ముద్దు పెట్టింది. ఇద్ద‌రి మ‌ధ్య ఏదేని స‌మ్‌థింగ్ ఉందా? అనే సందేహం కూడా చాలా మందికి రాక‌పోదు. అస‌లు విష‌య‌మేమంటే..

శ్రీముఖి మ‌ల్లెమాల సంస్థ‌లో హ‌లో బ్ర‌ద‌ర్ అనే ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

ఇందులో న‌వీన్ చంద్ర గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈవెంట్‌కి శ్రీముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది. హైప‌ర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా శ్రీముఖి చేతుల‌పై హైప‌ర్ ఆది, రామ్‌ప్ర‌సాద్ ..శ్రీముఖి చేతిపై ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక శ్రీముఖి అయితే స్టేజ్‌పైకి బావ అంటూ న‌వీన్ చంద్ర‌ను ఆహ్వానించింది. ఆయ‌న రావ‌టం రావ‌ట‌మే త‌న‌కు ముద్దు కావాలంటూ శ్రీముఖి అడిగాడు. అయితే శ్రీముఖి కూడా ఏమాత్రం వెనుకా ముందు ఆలోచించ‌కుండా న‌వీన్ చంద్ర‌కు బుగ్గ‌పై ముద్దు పెట్టేసింది.

శ్రీముఖి ఉన్న‌ట్లుండి బావ అంటూ న‌వీన్ చంద్ర‌కు బుగ్గ‌పై ముద్దు పెట్ట‌డ‌మ‌నేది అక్క‌డున్న యూనిట్ స‌భ్యుల‌ను సైతం షాక‌య్యేలా చేసింది. బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన శ్రీముఖి ఒక వైపు సినిమాలు.. మ‌రో వైపు బుల్లితెర ప్రోగ్రామ్స్ అంటూ బిజీగా ఉంది. మ‌రో వైపు సోష‌ల్ మీడియాలోనూ రీల్ వీడియోస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here