వెస్టిండీస్‌తో నాలుగో టీ20 ముంగిట భారత్ జట్టుకి ఉత్సాహానిచ్చే వార్త. వెస్టిండీస్‌తో సెయింట్స్ కిట్స్ వేదికగా ఇటీవల జరిగిన మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈరోజు ప్లోరిడాలో రాత్రి 8 గంటలకి జరగనున్న నాలుగో టీ20లో ఆడబోతున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ప్లోరిడాకి చేరుకున్న రోహిత్ శర్మ.. ఫిట్నెస్ కూడా సాధించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.విండీస్‌తో మూడో టీ20లో కేవలం 5 బంతులే ఆడిన రోహిత్ శర్మ.. ఒక ఫోర్, సిక్స్ బాది 11 పరుగులు చేశాడు. అయితే.. షార్ట్ పిచ్ బంతిని సిక్స్ కోసం ఫుల్ చేసే క్రమంలో రోహిత్ శర్మకి గాయమైంది. దాంతో.. వెన్ను నొప్పి కారణంగా మ్యాచ్ ఆరంభంలోనే రిటైర్డ్ హర్ట్‌గా రోహిత్ శర్మ పెవిలియన్‌కి వెళ్లిపోయాడు. గాయం తీవ్రత నేపథ్యంలో.. రోహిత్ శర్మ విండీస్‌తో ఈరోజు, ఆదివారం జరగబోవు నాలుగు, ఐదో టీ20లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. కానీ.. రోహిత్ శర్మ కోలుకున్నాడు.