నా ఫోటో పెట్టి దుష్ప్రచారం.. పోలీసులకు YCP నేత ఫిర్యాదు

0
3
YCP leader complains to the police about her photo
YCP leader complains to the police about her photo

వ్యవహారంలో తన ఫోటోను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త అనితా రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులకు టీడీపీ, జనసేనపై ఫిర్యాదు చేసిన అనితారెడ్డి
ఎంపీ మాధవ్ ఫోటో పక్కన తన ఫోటో పెట్టారని ఫిర్యాదు

కదిరి నియోజకవర్గం సోషల్ మీడియా కార్యకర్త అనితారెడ్డి

టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు ఎంపీ మాధవ్‌ (Mp Gorantla Madhav) వీడియో కాల్‌ వ్యవహారంలో.. ఆయన పక్కన తన ఫొటో పెట్టి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. తనపై దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని అనితారెడ్డి ఆరోపించారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.
తాను నాలుగేళ్లుగా వైసీపీ సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నానని.. అప్పటినుంచి టీడీపీకి చెందిన వారు తనను టార్గెట్ చేశారని చెబుతున్నారు అనితారెడ్డి. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని.. ఇప్పుడు మరీ నీచంగా ఎంపీ మాధవ్‌ పక్కన తన ఫొటో పెట్టి మార్ఫింగ్ చేశారన్నారు. ఇదంతా టీడీపీ కుట్ర అని.. ఆ పార్టీ కార్యాలయం నుంచే ఇదంతా జరుగుతోందన్నారు. లోకేష్ డైరెక్షన్‌లోనే కుట్ర జరిగిందని.. మహిళలను ఇంతలా వేధించడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here