నా విజయం వ్యక్తిగతం కాదు ద్రౌపది ముర్ము:

0
1

వార్డు కౌన్సిలర్‌గా మొదలైన తన ప్రమాణం రాష్ట్రపతి పదవి చేపట్టేవరకు కొనసాగిందని నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ఆమె ప్రసంగించారు.

కౌన్సిలర్‌గా మొదలైన తన ప్రయాణం భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకు కొనసాగిందని భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం చేశారు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది తన వ్యక్తిగత విజయం కాదని.. దేశంలోని గిరిజన, దళితుల విజయమని పేర్కొన్నారు. తన ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీకని, బాధ్యతల నిర్వహణకు ప్రజల విశ్వాసం మరింత బలాన్నిస్తుందన్నారు. దేశ 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సమయంలో రాష్ట్రపతిగా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఓ సాధారణ ఆదివాసీ మహిళ అయిన తాను దేశ అత్యున్నత స్థానానికి చేరుకోవడం ప్రజాస్వామ్యం గొప్పదనమని పేర్కొన్నారు.

గతంలో రాష్ట్రపతులుగా పనిచేసిన వారంతా ఆ పదవికే వన్నె తెచ్చారని.. తాను కూడా వారి బాటలోనే పయనిస్తానని ద్రౌపది ముర్ము అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంకల్పంతో ముందుకెళ్లాలని.. వచ్చే 25 ఏళ్లలో అద్భుమైన పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు చదువుకోవడం తన కల అని, తమ గ్రామంలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలిక తానేనని తెలిపారు. దేశ అత్యున్నత పదవికి ఎన్నిక కావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here