కార్తికేయ 2.. కొత్త రిలీజ్ డేట్ ఇదే:
సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ మరికొద్ది రోజుల్లో కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
- కార్తికేయ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) హీరోయిన్ గా నటించింది.
- నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ఫినిష్ అయినా కూడా ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆగష్టు 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా ఆ డేట్ కూడా కాదని కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
- తమ సినిమాను ఒక రోజు వాయిదా వేస్తూ ఆగష్టు 12న కాకుండా ఆగష్టు 13న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఊహించని షాకిచ్చారు.

- కాగా తన సినిమా కార్తికేయ 2కి ఆగస్ట్ 12న రిలీజ్ డేట్ అనేది అంత సులభంగా దొరకలేదని చెబుతూ దాని వెనుక ఎన్నో తతంగాలు జరిగాయంటూ ఇటీవల ఈ సినిమా హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
- ఈ పరిస్థితుల్లో తమ సినిమాను ఒకరోజు వాయిదా వేసి అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ కార్తికేయ 2 చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.
- ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో కూడా భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.