నిజామాబాద్‌లో షాకింగ్ ఘటన..

0
8

ట్రాక్టర్‌తో ఏటీఎం ధ్వంసం చేసిన దొంగ.. 

నిజామాబాద్ జిల్లా వర్ని పట్టణంలో ఓ దొంగ రెచ్చిపోయాడు. ఏటీఎంలో దొంగతనం విఫలం కావడంతో ట్రాక్టర్‌తో దాన్ని ధ్వంసం చేశాడు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏటీఎంలో దొంగతనానికి యత్నించిన వ్యక్తి అది ఓపెన్ కావడంతో ఆగ్రహానికి గురయ్యాడు. కోపంతో ఏకంగా ట్రాక్టర్‌తో మిషన్‌ని పెలికించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎం వద్ద ఓ వ్యక్తి కొంత సమయం పాటు రెక్కీ నిర్వహించాడు. ఎవరూ లేని సమయంలో చూసి ఏటీఎంలోని వెళ్లి మిషన్‌ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. అది తెరుచుకోకపోవడంతో ట్రాక్టర్‌తో దాన్ని పెకిలించేందుకు ప్రయత్నించాడు. అయితే మిషన్ కాస్త పక్కకు జరగడంతో అలారం మోగింది.

దీంతో ముంబయిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం సిబ్బంది అప్రమత్తమైన డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం రావడంతో వర్ని పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఏటీఎంను ధ్వంసం చస్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here