నితిన్ గడ్కారి కి ఘనస్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

0
8

గుంటూరు జిల్లా: గురువారం సాయంత్రం జిల్లాకు విచ్చేసిన కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కారి ని చేబ్రోలు మండలం వడ్లమానులోని విజ్ఞాన్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీక్రిష్ణ దేవరాయలు, జిల్లా ఎస్పీ ఆరీఫ్ హాఫిజ్ లు పుష్పాగుచ్చాలు అందించి సాదరంగా స్వాగతం పలికారు.

కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కారి ని మర్యాదపూర్వకంగా కలసిన వారిలో తెనాలి సబ్ కలెక్టర్ డా. నిధి మీనా, శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్య, తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి, నరసరావుపేట శాసన సభ్యలు డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరు శంకర రావు, విజ్ఞాన్ యూనివర్శిటీ చైర్మన్ లావు రత్తయ్య తదితరులు వున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here