నిధుల కోసం ఒక‌ మాట,చేతికి అందాక మరో మాట

0
7

రాజధాని లేకుండా చేసిన పార్టీలను ప్రజలముందు దోషిగా నిలబెడతాం అంతే కాదు పోలవరం ప్రాజెక్టు విషయంలో కుటుంబ పార్టీలతో పాటు సిపిఐ ల అభిప్రాయాలను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు తన మాటలతో చీల్చి చెండాడారు. అంతే కాకుండా మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పై సెటైరిక్ గా హాట్ కామెంట్స్ చేయడంతో పాటు అయన కెసిఆర్ తో ఉండవల్లి ఎందుకు సమావేశమౌతున్నారని ఆయన ప్రశ్నించారు. విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు అనంతరం రాజధానికోసం పాదయాత్ర చేసిన రైతులను , బిజెపి శ్రేణులను సోమువీర్రాజు స్వయంగా సన్మానించారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, బిట్ర శివన్నారాయణ,చందు సాంబశివరావు, లక్ష్మీపతిరాజా, పాటిబండ్ల రామక్రుష్ణ తదితరులు పాల్గొన్నారు
సోమువీర్రాజు ఇంకా ఏం మాట్లాడారంటే….

ఎపి లొ వైసిపి, టిడిపి లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు

నిధుల కోసం ఒక‌ మాట,చేతికి అందాక మరో మాట మాట్లాడుతున్నారు

గత, ప్రస్తుతం ప్రభుత్వాలు‌ చేసే మోసాలను ప్రజలకు వివరిస్తాం

పోలవరం విషయంలో సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు కలిశారు

సుజనా చౌదరి చేసిన విజ్ఞప్తి వల్లే పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు

చంద్రబాబు మోసం చేశారే తప్ప.. బిజెపి ఎప్పుడూ మాట తప్పలేదు

బిజెపి తో తెగ తెంపులు చేసినా… మోడీ ఎపి అభివృద్ధి కి నిధులు ఇచ్చారు

అయినా రాజధాని అభివృద్ధి చేయలేక పోయారు

మరొక ఆయన మూడు రాజధానులు పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారు

ఎపి రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం ఏమిటి

రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని అభివృద్ధి కి బాధ్యత వహించాలి

కమ్యూనిస్టు లు పాదయాత్ర చేస్తాం అంటున్నారు

ఎప్పుడు ఎవరితో కలిసి నడుస్తారో వాళ్లకే తెలియదు

ఆర్ ఆర్ ప్యాకపై వివరాలు జగన్ ఇచ్చాడా

అది ఇస్తే వారి లొసుగులు బయటకి వస్తాయనే భయం

ఎపి లో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయి

చంద్రబాబు ప్యాకేజీ ఉపయోగించింది వాస్తవం కాదా

మళ్లీ ప్రత్యేక హోదా అని ఎలా మాట్లాడతారు

నెల్లూరు లో‌బీచ్ స్టాండ్, గనులు, మట్టి అమ్ముకుని‌ కోట్లు దండుకోవాలనే ఆలోచనే

దోచుకోవడమ, దాచుకోవడం, దండుకోవడమే రెండు పార్టీ ల పని

బిజెపి బలపడితే కుటుంబ పార్టీ లకు ఫుడ్ ఉండదు

ఎపి అభివృద్ధి కి బిజెపి కట్టుబడి ఉంది

చంద్రబాబు ఎగిరారు… పని అయిపోయింది

ఇప్పుడు కేసిఆర్ ఎగురుతున్నారు… అదే రిపీట్ అవుతుంది

ఎపి లో కూడా ఇలాగే జరుగుతుంది.. కానీ సమయం రావాలి

మేము పదవుల‌ కోసం పార్టీ లు మారే వ్యక్తులం కాము

దేశానికి‌సేవ చేయడానికి తలెత్తుకుని సగర్వంగా పని చేస్తున్నాం

నేను బతికుండగా పోలవరం చూడలేనని ఓ పెద్దాయన రాజమండ్రి లో అంటారు

ఆయన‌ మా రాజకీయ గురువు.. ఆంధ్రా ఉద్యమం నడిపారు

ఇందిరాగాంధీ పై విమర్శలు చేసిన ఆ వ్యక్తి నేడు నేషనల్ హెరాల్డ్ గురించి మాట్లాడతారా

ఇందిరాగాంధీ నుండి రాహుల్ గాంధీ‌ వరకు స్పీచ్ ట్రాన్స్ లేట్ చేశాడు

రామోజీరావు పై కేసు వేస్తే… ఆయన వ్యవస్థలను మేనేజ్ చేశారు

ఎవరినీ ఏం‌ చేయలేక… ఏదేదో మాట్లాడతాడు

ఇప్పుడు కేసిఆర్ ను కలుస్తాడంట.. ఏం‌ చేస్తాడో మరి

నాకు ఆయన మీద ఇప్పటికి గౌరవం ఉంది

నోరు ఉంది కదా అని ఏదొకటి మాట్లాడి గౌరవం తగ్గించుకో కూడదు

దేశాన్ని అన్ని విధాలా మోడీ అభివృద్ధి చేస్తున్నారు

ఎపిలో మాత్రం బటన్ నొక్కితే డబ్బులు పడతాయంట

ఓటు బ్యాంకు రాజకీయాల‌ కోసం బటన్ నొక్కుతారు

విజయసాయి రెడ్డి కేంద్రం కన్నా రాష్ట్ర ఆర్దిక పరిస్థితి బాగుంది అంటున్నారు

Nrgs నిధులు తీసుకున్నారు.. అవినీతి కి పాల్పడ్డారు

ఆర్ధిక విధానంలో సరి తూగే దమ్ము, ధైర్యం జగన్ ప్రభుత్వానికి లేవు

కార్పొరేషన్ లు సృష్టించి అప్పులు తేవడం కాదు

ఎపి ని అభివృద్ధి చేసే విషయంలో బిజెపి మాత్రమే మాట మీద ఉంది

రాజధాని రైతులకు భూములు ఇంకా ఇవ్వలేదు

అన్నదాత లను మోసం చేసిన వారి ఉసురు పోసుకుంటారు

రాష్ట్ర రాజధాని‌ కట్టము అని జగన్ ప్రభుత్వం అఫిడవిడ్ వేశారు

అందం కలిసి ఉద్యమం చేసి.. ఆ పార్టీ ని ఓడించాలి

రాష్ట్రం రాజధాని, పోలవరం అంశాలే ఉన్నాయా

ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న హంద్రీనీవా, గాలేరు‌ వంటి ప్రాజెక్టు గురించి ఎందుకు రాయరు

వీటి గురించి కూడా పత్రికలు దృష. పెట్టాలి

అమరావతి అభివృద్ధి చెందాలి, రైతులకు న్యాయం చేయాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here