నీళ్లకోసం ధర్నా చేసిన వై.సి.పి.నాయకులు..

0
5

అగ్ని న్యూస్ పెద్దారవీడు మండలంలో మద్దలకట్ట గ్రామంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రతిపక్ష నాయకులు ప్రజా వ్యతిరేక సమస్యలపై పోరాడుతారు.కానీ మద్దల కట్ట గ్రామంలో అధికారపక్ష నాయకులే మంచినీళ్ల కోసము రోడ్ ఎక్కారు.. అంతటితో ఆగకుండా ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేశారు.. ఇదంతా ఎక్కడో జరిగిందో అని అనుకోకండి సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం మద్దల కట్ట గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం.
వివరాల్లోకెళ్తే జడ్డ.లక్ష్మయ్య, దర్శనం యోకోబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు కాళీ బిందెలతో కర్నూల్ గుంటూరు రోడ్ పైన ధర్నా నిర్వహించట ముతో ,రోడ్ పైన కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులకు గురైన వాహనదారులు.. తర్వాత సచివాలయం దగ్గర ధర్నా నిర్వహించి సచివాలయంకు తాళం వేసి ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో రెండు రోజుల నుండి నీళ్ళు లేవు సాగర్ వాటర్ సంపు దగ్గర నుండి ట్రాక్టర్ ట్యాంక్ లకు నీళ్లు నింపు కొని తోలుకొని కొంతమంది నాయకులు బిల్లులు తీసుకొంటు సొమ్ము చేసుకున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరిచారు..
సాధారణంగా ట్యాంకర్లు నడుపు వారు బోరు వేసుకుని నడపాల్సి ఉండగా, సాగర్ నీరు వచ్చే సంపులో నీళ్లు తొలితే,ఎలా అని ఏఈ. నాగరాజు ను గట్టిగా నిలదీసిన మహిళలు, ఆయన వెంటనే సంపులోనీ నీరు వద్దు, వేరే దగ్గర నిండి తొలమని ట్యాంకర్ల యజమానులకు తెలియజేయడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది..
ఈ కార్యక్రమంలో కాలి బిందెలతో పలువురు మహిళలు, నాయకులు మూల.సత్యనారాయణ రెడ్డి, మూల.శ్రీనివాసరెడ్డి, జడ్డ. లక్ష్మయ్య, జడ్డ.రాజు, దర్శనం.యోబు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here