నెల్లూరు జిల్లా కి ఏమైంది..?

0
7

నెల్లూరు జిల్లాను కమ్మేసిన “జ్వరాలు నెల్లూరు జిల్లాలో విజృంభిస్తున్న జ్వరాల కట్టడికి అధికార యంత్రాంగం అధికార పార్టీ నాయకులు వెంటనే స్పందించి అన్ని మండలాల్లో డివిజన్లలో లలోని అన్ని వర్గాల ప్రజలకు “మెడికల్ క్యాంపులు” ఏర్పాటు చేసి “రక్త పరీక్షలు” నిర్వహించి “ఉచితంగా మందులు” పంపిణీ చేయాలి!

నెల్లూరు జిల్లాలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు చిన్నారులకు ప్రాణ నష్టం జరగకుండా వైద్య సలహాలతో కరపత్రాలు పంపిణీ చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేయాలి!

నెల్లూరు జిల్లాపరిధిలోని అన్ని వీధులలో,ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో జ్వరాలు సోకకుండా ఫాగింగ్,శానిటేషన్ ప్రతినిత్యం వీధి కాలువలు శుభ్రం చేసేలా చర్యలు చేపట్టాలి!

కరోనా వచ్చింది ఎంతోమంది ఆత్మీయులను సన్నిహితులను స్నేహితులను కడసారి సైతం చూడకుండా పోగొట్టుకున్నాం ఇప్పుడు ఒమెక్రాన్,విష జ్వరాలతో నెల్లూరు జిల్లా ప్రజల ప్రాణాలు పోకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయాలతో పాటు ముందస్తుగా సిద్ధం చేయాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వం పై వుంది!

నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాలలోని ప్రతి గడపకు విషజ్వరాలు సోకి అంటువ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు అధికార పార్టీ నాయకులు దృష్టి సారించకపోవడం శోచనీయం!

ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రులతో జిల్లా అధికారులు అధికార పార్టీ నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లాలో “హెల్త్ ఎమర్జెన్సీ” ప్రకటించి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here