నేషనల్ ల్యాండ్ మోనెటైజేషన్ కార్పోరేషన్..

0
10

ప్రభుత్వ మిగులు –వుపయోగంలేని ఆస్తులు అమ్మకంపై మాగుంట ప్రశ్న

దేశంలో నేషనల్ ల్యాండ్ మోనెటైజేషన్ కార్పోరేషన్ ఏర్పాటు గురించి, కేంద్ర సంస్థల మిగులు భూములు మరియు ఉపయోగంలేని భవనాల మరియు ఆస్తుల చలామణి/అమ్మకం ప్రక్రియ గురించి, 2021-22 లో అన్ని మంత్రిత్వ శాఖలు వాటిపై సాధించిన లక్ష్యం మరియు 2022-23 కు నిర్దేశించిన లక్ష్యం – అమ్మకాల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డిగారు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయక మంత్రి, గౌ. డా. భగవత్ కరాడ్ గారు సమాధానమిస్తూ-
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేవిధంగా రూ.5,000 కోట్ల ప్రారంభ వాటా ధనంతోను మరియు 150 కోట్ల చెల్లింపుల వాటా ధనంతో “నేషనల్ ల్యాండ్ మోనెటైజేషన్ కార్పోరేషన్” ఏర్పాటుకు 09-03-2022 తేదీన కేంద్రం ఆమోదం తెలిపిందని మరియు ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థల మిగులు భూముల మరియు ఉపయోగంలేని భవనాల తదితర ఆస్తుల అమ్మక/చలామణి ప్రక్రియ గురించి ఈ కార్పోరేషన్ చూస్తుందని మరియు దీనివలన ప్రభుత్వానికి గణనీయ ఆదాయం రావడం వలన ప్రైవేటు పెట్టుబడులు తగ్గడంతోపాటు క్రొత్త ఆర్ధిక కార్యకలాపాలు చేపట్టవచ్చని తెలిపారు.
రోడ్డు రవాణా – హైవేలు, రైల్వేలు, పవర్, ఓడరేవులు, పౌర విమానయాన, పెట్రోలియం – సహజవాయువుల తదితర మంత్రిత్వ శాఖలకు సంబంధించి 2021-22 లో ఆస్తుల అమ్మకాల వలన రూ.88,190 కోట్లు మరియు 2022-23 లో రూ. 1,62,422 కోట్లు వస్తాయని కార్పోరేషన్ ఊహించినదని కేంద్ర మంత్రిగారు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here