నేషనల్ హెల్త్ మెషిన్ ఉద్యోగుల పై ఎందుకు ఇంత వివక్ష …?

0
3

11.08.2022 న ఈ రోజు నేషనల్ హెల్త్ మిషన్ అక్క చెల్లెళ్లు జగన్ అన్నకు రక్షాబంధన్ ద్వారా విజప్తి చేసినారు . రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల వివిధ విభాగాల్లో అనేక సంవత్యరాలుగా కాంట్రక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పి.ఆర్.సి – 2022 ప్రకారం వేతన సవరణ చట్టం అమలులు ఉత్తర్యులు జారీచేసియున్నారు. సూచిక జనవరి 2022 నుండి కాంట్రక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసినది. నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పై సూచికలో తెలియజేసిన ఉత్తర్యులు అమలు చేయకపోవడం వలన యాన్.హెచ్.యమ్,ఉద్యోగులు త్రీవ ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి యాన్.హెచ్.యమ్. ఉద్యోగులకు, వైద్య ఆరోగ్యశాఖలోని సంబంధిత కేడర్ల రెగ్యులర్ ఉద్యోగుల మినిమం టైం స్కేలును జనవరి 2022 నుండి వర్తింపజేస్తూ వెంటనే తగు ఉత్వర్వులు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరికి పి.ఆర్.సి. – 2022 ప్రకారం జి.ఓ.నెంబర్ 5 అమలు చేస్తూ యమ్.టి.ఎస్, వేతనాలు చెల్లిస్తున్నారు కేవలం నేషనల్ హెల్త్ మిషనలో పనిచేస్తున్న కాంట్రక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేటికీ పై ఉత్తర్వూలు అమలు చేయకపోవడం వలన పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో చాలీచాలని జీతాలతో త్రీవ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాము. తమరు మానవతా దృక్పదంతో స్వంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించి తక్షణమే న్యాయం జరిగేలా తగు ఉత్వర్వులు ఉన్నత అధికారులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నేస్తానల్ హెల్త్ మెషిన్ ఉద్యోగులకు 11వ పి.ఆర్.సి ప్రకారం మినిమం టైం స్కేల్ ( యమ్.టి.ఎస్ ) ప్రారంభ తేదీ
జనవరి 2022 నుండి పూర్తి స్థాయిలో అమలు చేయాలి .రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా యన్.హెచ్.యమ్. ఉద్యోగులకు సమాన పనికి – సమన వేతనం సమాన సౌకర్యాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులను ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ తదితర రాష్టాలలో వాలే నేరుగా రెగ్యులర్ చేయాలి. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకుమధ్యప్రదేశ్,బీహార్ తదితర రాష్ట్రలో అమలవుతున్న విధింగా 35 క్యాజువల్ లీవ్స్ , మెడికల్ లీవ్స్ , పెటర్నటీ లీవ్స్, మరియు మెటర్నటీ లీవ్స్, అన్ని రకాల బెనిఫిట్స్ అమలు చేయాలి. కోవిడ్ కాలంలో విధులు నిర్వర్తించి మరణించిన నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరికి 50 లక్షలు ఇన్సురెస్ సౌకర్యం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించాలి. గా విజ్ఞప్తి చేయడం జరిగినది . ఈ కార్యక్రమంలో ఏ.పి యాన్.హెచ్.యమ్ జిల్లా స్టేట్ జనరల్ సెక్రటరీ చల్లా ప్రభాకర్ రెడ్డి ఐ.డి.ఎస్.పి., జిల్లా జనరల్ సెక్రటరీ యస్. ఏడుకొండలు, యాన్.హెచ్.యమ్. అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here