ట్విట్టర్ లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు..
75 వసంతాల స్వాతంత్య్ర భారతంలో…. దేశం నలుమూలలా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం ప్రజలందరిలో భావోద్వేగాన్ని నింపుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగాను విజయవంతం చేద్దాం. జాతీయజెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య మన తెలుగువాడు అయినందున ఈ కార్యక్రమం మన తెలుగు ప్రజలకు మరింత ప్రత్యేకం. ప్రతి ఇంటా జాతీయజెండా రెపరెపలతో, ప్రతి మదిలో జాతీయభావం పెంపొందేలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిద్దాం. విజయాలను స్మరించుకుంటూ, లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగుదాం. నేషన్ ఫస్ట్ అనే నినాదాన్ని గట్టిగా వినిపిద్దాం. ఈ 75 ఏళ్ళు భారతావని సాధించిన ప్రగతిలో… 40 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామిగా ఉండటం మరింత గర్వకారణం.