న్యాయం జరగకపోతే ఆత్మహత్యే..

0
7

నమ్ముకున్నవాడే నట్టేట ముంచేశాడు

న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం

భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉండదా

ఆస్తి లో వాట ఇవ్వకపోతే నా పిల్లలు భవిష్యత్తుకు భరోసా ఏంటీ

ఎన్ని చట్టాలు వచ్చినా.ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆడపిల్ల మోసపోతుంది అన్యాయమే జరిగుతుంది అన్నదానికి ఇదో ఉదాహరణ
టెక్కలి లో ఓ మహిళ వారం రోజులు గా తనకు న్యాయం చేయాలంటూ తన పిల్లలతో మౌన దీక్షకి దిగడం అంతేకాక బుధవారం నాడు పురుగులు మందు వెంట తెచ్చుకుని తను.పిల్లలు తాగేస్తామనడం టెక్కలి పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..టెక్కలి మండలం తిర్లంగి పంచాయతీ గంగాధర పేట కు చెందిన సంగీతాకు అదే మండలం టెక్కలి కి చెందిన ఉర్లాపు సూర్య ఇంజినీరింగ్ కంపెనీ లో జాబ్ అంటూ మాయమాటలు చెప్పి సంబంధం కుదుర్చుకున్నారు. 2011 సంవత్సరం లో ఇరు పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహం జరిగిన వారం రోజుల్లో హైదరాబాద్ లో స్థిరపడ్డారు. కొద్ది రోజుల తరువాత సూర్య అసలు రూపం బయటపడింది. ఏ కంపెనీలో ఉద్యోగం లేదని తెలుసుకున్న సంగీత అమ్మ వాల పరిస్థితి అంతంత మాత్రమే కావడం తో ఎవరికి చెప్పలో తెలియక ఏమితోచక దిక్కు తోచని స్థితిలో ఉండిపోయింది. సూర్య ఓ ఐస్ పార్లర్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సొంతంగా పార్లర్ పెటితే బాగుంటుందని మీ అమ్మ వాలకు కొంత మొత్తం లో డబ్బులు అడగమని తిరిగి ఇచ్చెద్దామని సంగీత కి చెప్పడంతో మీరే అడగాలని సూచించింది కూతురు జీవితం బాగుంటుంది అనే ఆశతో ఊరి వారి దగ్గర అప్పు చేసి మరీ 3 లక్షల రూపాయలు పార్లర్ పెట్టడానికి ఇచ్చింది కొద్ది రోజుల పాటు సాఫీగా సాగిన వీరి కుటుంబంలో మనస్పర్థలు తలెత్తడంతో తిరిగి టెక్కలి కి చేరుకున్నారు.టెక్కలి చేరుకున్న రోజే సూర్య చెప్పలేని రీతిలో సంగీత కు వాల ఫ్యామిలీ కి తిడుతూ సోషల్ మీడియా లో ఊరు గ్రూప్ కు మెసేజ్ లు పంపించడంతో పాటు సంగీత వాల ఫ్యామిలీ మీద కు దాడి చేయడం తో 100 కాల్ చేసి ఫిర్యాదు చేసారు. అప్పుడు ఇరువురుకి పోలిస్ స్టేషన్ కి పిలిపించి నచ్చజెప్పి పంపించారు. తరువాత సూర్య తనను పిల్లలను విడిచి పెట్టి హైదరాబాద్ వెల్లిపోయాడు. తమకు న్యాయం చేయాలని పిల్లల పోషణ కోసం క్రిందటి సంవత్సరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు కోర్టు లో కేసు ఉండగా సూర్య పూర్వికుల కు సంబంధించిన ఆస్తి కొందరు రెవెన్యూ అధికారులతో కలిసి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లో తమ పేర్లను లేకుండా చేసి కోటబొమ్మాళి రిజిస్ట్రార్ కార్యాలయంలో అమ్మేసారని. ఇప్పుడు ఏ ఆధారం లేని నేను నా పిల్లలు ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఆస్తి కొన్నవ్యక్తి ఆస్తి లో ఉన్న ఇల్లు ను జేసీబి సహాయం తో కూలగొట్టేసారని ఆమె తెలియజేశారు ఇప్పటికే జిల్లా యస్పీ మరియు కలెక్టర్ కు ఫిర్యాదు చేసామని ఇప్పటికి నాకు నా పిల్లలకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం అని. తనకు న్యాయం జరగకపోతే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకొనెందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here