ప్రస్తుతం మునుగోడు పైనే కేసిఆర్ టార్గెట్..

0
24
  • సరైన సమయంలో సరైన రాజకీయ వ్యూహం అమలు చేసి సక్సెస్ సాధించడం ఎలాగో టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కు బాగా తెలుసు. ఆతరహా వ్యూహాలతోనే ప్రత్యేక తెలంగాణ సాధించడంతో పాటు, టిఆర్ఎస్ ను రెండుసార్లు అధికారంలోకి తీసుకురాగలిగారు.
  • తెలంగాణలో తమకు తిరుగులేకుండా చేసుకునేందుకు నిత్యం కేసీఆర్ ప్రయత్నిస్తూనే ఉంటారు . తమ పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేసే విషయం పైన స్పెషల్ గా ఫోకస్ పెడుతూ ఉంటారు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణలో బిజెపిలో చేరికలు జోరందుకున్నాయి.
  • కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు బిజెపిలో చేరుతున్నారు. దీనిలో భాగంగానే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈనెల 21వ తేదీన అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరబోతున్నారు. అలాగే ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయబోతుండడంతో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
  • ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎలా గెలవాలనే విషయంపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించడంతో పాటు, అభ్యర్థులు ఎంపికైన కసరత్తు చేస్తున్నాయి. అయితే మునుగోడుపై కేసీఆర్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థులుగా ఎవరిని రంగంలోకి దింపాలనే విషయంపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. దీంతోపాటు ప్రశాంతి కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్, వివిధ సర్వే సంస్థలు రంగంలోకి దిగి పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ఈ సర్వే సంస్థలు, నిఘా వర్గాల నివేదికలు పూర్తిగా పరిశీలించి పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది ? ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు ? ఇలా అనేక అంశాలపై కేసీఆర్ ఒక అవగాహనకు వస్తున్నారు.అయితే గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో మాదిరిగా కంగారు పడకూడదు అని, హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో అభ్యర్థులు ఎంపిక సరిగా లేకపోవడంతోనే పార్టీ నష్టపోయిందని, కానీ ఈసారి అలా దూకుడుగా నిర్ణయాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.
  • మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తో పాటు, అనేకమంది కీలక నేతలు కేసీఆర్ ను కలిశారు. మునుగోడు నియోజకవర్గం లో టిక్కెట్ ఇచ్చే విషయంలో టిఆర్ఎస్ బలాన్ని అంచనా వేస్తూ తాజా పరిణామాలపై మంత్రి జగదీష్ రెడ్డి తోనూ కేసీఆర్సా చర్చిస్తున్నారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా టిఆర్ఎస్ ఇంచార్జి ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే రవీందర్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కేసీఆర్ మునుగోడు ఎన్నికల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా గతంలో మాదిరిగా హడావుడిగా జనాల్లోకి వెళ్ళకూడదని, క్షేత్రస్థాయిలో పరిస్థితిలేమిటో పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత అన్ని విషయాలను పూర్తిగా అవగాహన తెచ్చుకుని అప్పుడు జనాల్లోకి వెళితే ఫలితం ఉంటుందనే విషయాన్ని కేసిఆర్ ఈ సందర్భంగా పార్టీ నాయకులకు సూచించినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here