పలు పథకాల ద్వారా 9.32రూ..లక్షల లబ్ధి

0
6

గుడిసెలో ఉంటున్న వృద్ధుడికి పుస్తకం అందించిన ఎమ్మెల్యే.. అవాక్కయిన లబ్ధిదారుడు.. ఎందుకంటే?

కొన్నేళ్ల కిందట భార్య మరణించగా.. ప్రస్తుతం ఆ వృద్ధుడు ఒంటరిగా గుడిసెలో ఉంటున్నారు.ఆయన పలు పథకాల ద్వారా రూ.9.32 లక్షల లబ్ధి పొందినట్లు గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుస్తకం అందించారు.అందులోని వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోవడం ఆ వృద్ధుడి వంతైంది.

కర్నూలు జిల్లా ఆదోనిలోని అంబేడ్కర్‌నగర్‌లో సోమవారం ‘గడప గడపకూ…’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, పురపాలక అధికారులు పర్యటించారు.

మాల అంజినయ్య అనే వృద్ధుడు పలు పథకాల కింద రూ.9.32 లక్షల లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే పుస్తకం అందించారు.

ఆ తర్వాత అందులోని వివరాలు తెలుసుకున్న అంజినయ్య అవాక్కయ్యారు.

ఆయన పూరిగుడిసెలో ఉంటూ వృద్ధాప్య పింఛనుతో జీవనం గడుపుతున్నారు.★ ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చినట్లు గతంలో పత్రం ఇచ్చారు. కానీ ఆ స్థలాన్ని చూపలేదు.

అయితే ఇంటి స్థలానికి రూ.6 లక్షలు, నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున లబ్ధి పొందినట్లు పుస్తకంలో నమోదు చేశారు.

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలే వెచ్చిస్తోంది. రూ.2.50 లక్షలు చెల్లించినట్లు చూపారు.

కాలనీలో చాలామంది ఇంటి లబ్ధిదారులకు ఇలాంటి పుస్తకాలే అందించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here