పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్..

0
11
We will build a highway over your houses in Idupulapaya: Pawan

‘అనడానికి మనమెవరం.. అంతా వాడి ఇష్టం’: పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్

 జగన్ సర్కార్ టార్గెట్‌గా చేసిన కార్టూన్ ట్వీట్ వైరల్ అవుతోంది. మద్య నిషేధంపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ జనసేనాని సెటైర్లు పేల్చారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ కార్టూన్‌తో జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. రెండు రోజుల క్రితం మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మద్య నిషేధంపై చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చారు. మొన్నటి వరకు వరకూ ఏపీలోని రోడ్ల దుస్థితిని కార్టూన్‌లు ట్వీట్ చేసిన ఆయన.. తాజా మద్య నిషేధం అంశాన్ని ప్రస్తావించారు. మద్యపాన నిషేధంపై సెటైరికల్ కార్టూన్‌ను ట్వీట్ చేశారు. ‘మద్యం మిథ్య.. నిషేధం మిథ్య.. తాగమని, తాగొద్దని అనడానికి మనమెవరం.. అంతా వాడి ఇష్టం’ అంటూ కార్టూన్‌ను ట్వీట్ చేశారు జనసేనాని.

ఏపీలో మద్యనిషేధంపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలతో ఈ రగడ మొదలైంది. తమ పార్టీ మేనిఫెస్టోలో మద్య నిషేధం అనే పదమే లేదని.. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని మాత్రమే చెప్పామన్నారు. పూర్తిగా మద్య నిషేధం చేస్తామని తాము చెప్పలేదని.. మద్యం ధరలను ఫైవ్ స్టార్ హోటళ్ల స్థాయికి పెంచుతామని.. మందుబాబులకు షాక్ కొట్టేలా చేస్తామని మాత్రమే తాము ప్రస్తావించామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లినా తమ మేనిఫెస్టో ఉంటుందన్నారు.. కావాలంటే చూసుకోవచ్చన్నారు.

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరల్ని భారీగా పెంచింది. పొరుగ రాష్ట్రాల నుంచి మద్యం రాష్ట్రంలోకి అక్రమ రవాణా చేయకుండా అడ్డుకట్ట వేసింది.. ఎస్‌ఈబీతో నిఘా పెంచింది. అయితే వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను పరిశీలిస్తే.. ‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5 స్టార్ హోటల్స్‌కి మాత్రమే పరిమితం చేస్తాం’ అని పొందుపరిచారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here