పవర్ ప్రాజెక్టును నడపడం చేతకాకపోతే మా JACకి అప్పజెప్పండి

0
5

అనుభవజ్ఞులైన ఉద్యోగులతో నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి చూపిస్తాం

వచ్చే నెలలో మూడో యూనిట్ ప్రారంభోత్సవానికి వస్తున్నారంట కదా..అప్పుడు మాలో ఐదారుగురికి కలిసి అవకాశం ఇవ్వండి

మేం చెప్పేది తప్పైతే మమ్మల్ని బొక్కలో వేయండి…ఒప్పు అయితే మీ నిర్ణయం మార్చుకుని జెన్ కో ను ప్రభుత్వ రంగంలోనే నడపండి

అలా కాకుండా మూడో యూనిట్ ఓపెనింగ్ చేసిన తర్వాత తాళం అదానీకి ఇచ్చి వెళతామంటే మాత్రం చూస్తూ ఊరుకోం..తాడో పేడో తేల్చుకునేంత వరకు పోరాడుతాం

ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన పోరాటం 200వ రోజుకు చేరిన సందర్భంగా ప్రాజెక్టు ప్రధాన గేటు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్

అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్క నెల్లూరు జిల్లాలోనే 30 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో అనేక ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేశారు

ఉత్తరాంధ్ర ప్రజలు తరిమికొట్టిన ఎన్.సీ.సీ, గాయత్రి ప్రాజెక్టును నెల్లూరులో తెచ్చిపెట్టారు. ప్రకాశం జిల్లా ప్రజలు వద్దనుకున్న ఏపీ జెన్ కో ప్రాజెక్టును కూడా ఇక్కడకే తెచ్చారు

అప్పట్లో దివంగత నేత, పెద్దాయన జక్కా వెంకయ్య నేతృత్వంలో పోరాటం చేసే సమయంలో మేమంతా ఒక్కటే చెప్పాం. ఒక్క ఏపీ జెన్ కో ప్రాజెక్టును మాత్రమే నెల్లూరులో పెట్టండి..మిగతావి వద్దన్నాం

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాప్రయోజనాల కోసం ఏపీ జెన్ కో, రిలయన్స్ ప్రాజెక్టులకు మాత్రమే అంగీకరించాం

అలా 21 వేల కోట్లతో 2400 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేసుకున్న సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టడానికి మనస్సు ఎలావస్తుందో

అబ్బ బావి తవ్వితే కొడుకొక్కి పూడ్చేసినట్టు, రాజశేఖర్ రెడ్డి హయాంలో 1600 మెగావాట్లతో చేపట్టిన జెన్ కో ప్రాజెక్టును ఈ రోజు జగన్ రెడ్డి అదానీకి ఇచ్చేస్తారంట

ఇప్పటికే పక్కనే ఉన్న కృష్ణపట్నం పోర్టును అదానీకి కట్టబెట్టేశారు.

అంతకు ముందు పోర్టు ఎలా కళకళలాడింది..అదానీ చేతుల్లో పెట్టిన తర్వాత ఎలా మారిందో అందరం చూస్తున్నాం

కృష్ణపట్నం పోర్టు నుంచి జరిగే కార్యకలాపాలన్నింటిని తమిళనాడుకు తరలించేయడంతో ఇక్కడ ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది

రేపు జెన్ కో పరిస్థితి కూడా అంతే…రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు లేని విధంగా పోర్టు నుంచి నేరుగా కన్వేయర్ బెల్టు ద్వారా నాణ్యమైన బొగ్గును దిగుమతి చేసుకునే అవకాశం ఒక్క దామోదరం సంజీవయ్య కష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టుకు మాత్రమే ఉంది

అన్ని వసతులతో కూడి కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టును రన్ చేయలేరంట..పాతడొక్కు, నాన్ సూపర్ క్రిటికల్ ప్రాజెక్టులైన ఆర్టీపీపీ, ఎన్టీపీసీని మాత్రం రన్ చేస్తారంట

9 లక్షల టన్నుల మట్టితో కలిసిన నాసిరకమైన బొగ్గును దిగుమతి చేసి జెన్ కో ప్రాజెక్టును నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు

జెన్ కోకు 700 కోట్ల నష్టం రాగా నాణ్యమైన మిషనరీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది

కమీషన్ల కోసం చేసిన దుర్మార్గాలతో ప్రాజెక్టును షట్ డౌన్ చేసే పరిస్థితి తెచ్చారు

ఇంత జరుగుతున్నా లక్షల రూపాయలు ప్రజల డబ్బును జీతాలుగా తీసుకుంటున్న డైరెక్టర్లు, ఉన్నతాధికారులు నోరెత్తకపోవడం బాధాకరం

అసలు ఈ భారీ కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులందరి బండారం బయటపెట్టడానికి ఈ రోజుకీ ప్రయత్నం జరగకపోవడం దురదృష్టకరం

9 లక్షల టన్నులు మట్టిమషానంతో కలిసి బొగ్గును తెస్తే పోలీసులు స్పందించరు కానీ..ప్రాజెక్టు ఆవరణలో కార్మికులు నిరసన తెలిపేందుకు షామియానా వేసుకోవడానికి మాత్రం తోడేరు రెడ్డి అనుమతి కావాలంట

నీడ కోసం కార్మికులు ఒక షామియానా వేసుకుంటే పోలీసులకు ఏం పోతుంది..

తోడేరు అన్న అండతో పోలీసుస్టేషన్లను ఎస్సైలు పంచుకుంటూ దోచుకుంటున్నారు

అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న కరిముల్లాకు వెంకటాచలం నుంచి ప్రమోషన్ కింద ఇసుక రీచ్ లు, మైనింగ్ ఉన్న పొదలకూరు మండలం అప్పగించారు..అక్కడ కూడా ప్రాణాలు తీయడమే పనిగా పెట్టుకున్నాడు

ఈ పోలీసుల యూనిఫాం చూస్తే మనం భయపడాలా….అప్పట్లో మన పెద్దోళ్లు అలాగే కూర్చునివుంటే స్వాతంత్ర్యం వచ్చి వుండేదా

మూడేళ్లుగా ఏపీ ప్రజలు మళ్లీ స్వాతంత్ర్యం కోల్పోయారు..మన స్వాతంత్రం కోసం మనం ఇప్పుడు పోరాటం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది

దేశమంతా జెండా పండగలు జరుగుతుంటే ఏపీలో మనం మాత్రం వైసీపీ నేతల బూతు ప్రదర్శనలు చూడాల్సిన ఖర్మ పట్టింది

కార్యక్రమంలో పాల్గొన్న పవర్ ప్రాజెక్టు పరిరక్షణ కమిటీ కన్వీనర్ మోహన్ రావు, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీపీఐ న్యూ డెమాక్రసి నేత సీఎస్ సాగర్, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు జె.కిషోర్ బాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి,ఐఎఫ్ టీయూ నాయకులు రాంబాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.పెంచల నరసయ్య, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షులు ఆంజనేయులు, సీపీఐ నేత ఏడుకొండలు, జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు, సీపీఎం మండల కార్యదర్శి గడ్డం అంకయ్య, జేఏసీ చైర్మన్ చీకిరి ఆదిశేషయ్య, జేఏసీ జనరల్ సెక్రటరీ కల్తూరి రవి, సీఐటీయూ మండల కార్యదర్శి కె.నాగరాజు, టీడీపీ ముత్తుకూరు, తోటపల్లి గూడూరు, వెంకటాచలం మండల అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, గుమ్మడి రాజాయాదవ్ తదితరులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here