పసికందు నోట్లో ‘ఈ సిగరెట్’..

0
3

వ్యక్తి అరెస్ట్.. 20ఏళ్ల జైలుశిక్ష..?

సరదాగా చేసిన పని ఓ యువకుడి కొంప ముంచింది. ఊహించని విధమైన పరిణామాన్ని ఎదుర్కొన్నాడు. ఏకంగా అరెస్ట్ అయ్యాడు. 20 ఏళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఇంతకీ అంతగా ఏం చేశాడనుకుంటున్నారా… పాప నోట్లో ఈ సిగరెట్ పెట్టాడు. దీనిని పోలీసులు అత్యంత బాధ్యతారహితమైన పనిగా భావించారు. దాంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మలేషియాలో జరిగింది.

మలేషియాలో ఓ యువకుడు (23) గత శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బందర్‌బారు ఉడాలో పాప అత్తతో కలసి భోజనం చేశాడు. అదే సమయంలో పాపను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడే అతను సరదాగా పాప నోట్లో ఈ సిగరెట్‌ను పెట్టాడు. అయితే ఆ శిశువు ఈ సిగరెట్ నుంచి ఎటువంటి పొగలు పీల్చుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై తీవ్ర దుమారం రేగింది. దాంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నాడు. ఆ వ్యక్తి బర్గర్ విక్రేతగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది.

“పాపను ఒళ్లో కూర్చోబెట్టుకున్న వ్యక్తి సరదాగా పనిచేయని ఈ-సిగరెట్‌ను శిశువు నోట్లో పెట్టాడు. పాపాయి తల్లి సోదరి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.” అని నార్త్ జోహార్ బారు జిల్లా పోలీసు కమాండర్ రూపయ్య అబ్ద్ వాహిద్ తెలిపారు. దీనిపై పాపాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక మీడియా కథనం ప్రకారం నిందితుడిని ఆగస్టు 8న మలేషియాలో అరెస్టు చేశారు. ఇందులో దోషిగా తేలితే 20 సంవత్సరాల వరకు జైలుశిక్ష, అలాగే జరిమానా కూడా విధించే ఛాన్స్ ఉందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. చిన్నారిని ప్రమాదానికి గురి చేసినందుకు ఆ వ్యక్తిపై అభియోగాలు మోపబడినట్టు తెలుస్తుంది.

అయితే జరిగిన సంఘటనపై అరెస్టైన యువకుడు హైకాల్ వివరణ ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు. పాప నోట్లో ఈ సిగరెట్ పెట్టినప్పుడు అది పనిచేయలేదని చెప్పాడు. తరచుగా ఆ పాప దాంతో ఆడుకుంటుండేదని చెప్పుకొచ్చాడు. “నేను హైకాల్.. నిజమేమిటంటే, పాప నోటిలో వేప్ పెట్టడం నా తప్పు. వేప్ పనిచేయ లేదు. శిశువు తరచుగా దాంతో ఆడుకుంటుంది.” అని వివరణ ఇచ్చాడు. కానీ ఆ వీడియోపై నెటిజనలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాప ఆరోగ్యంతో ఆడుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ సిగరెట్ పనిచేసినా.. చేయకపోయినా.. అందులో ఏముందో తెలుసా..?” అంటూ కడిగి పారేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here