పాకిస్థాన్ లో ఎట్టకేలకు ఓ పురాతన హిందూ దేవాలయం క్రైస్తవులు చేతుల నుంచి విముక్తి పొందింది.
1200 ఏళ్లనాటి ఆ పురాతన దేవాలయం తిరిగి తెరుచుకోనుంది. కోర్టులో సుదీర్ఘ కాలం పోరాటం తరువాత క్రైస్తవుల నుంచి విముక్తి పొందిన ఆ ఆలయం ధర్మాసనం ఆదేశాలతో పూర్తిస్థాయిలో తిరిగి తెరుచుకోనుంది.
లాహోర్లో ఉన్న వాల్మీకి ఆలయాన్ని ఆక్రమించుకున్న ఓ క్రైస్తవ కుటుంబం నుంచి దానిని చట్టం ప్రకారం దక్కించుకున్నామని దానిని పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని పాకిస్థాన్లో మైనారిటీ ప్రార్థనా స్థలాలను పర్యవేక్షిస్తున్న ఫెడరల్ బాడీ ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ETPB) బుధవారం (ఆగస్టు 3,2022) వెల్లడించింది. లాహోర్లో ప్రసిద్ధి చెందిన అనార్కలి బజార్ సమీపంలో ఉన్న వాల్మీకి ఆలయాన్ని ఓ క్రైస్తవ కుటుంబం నుంచి గత జులైలో బోర్డు స్వాధీనం చేసుకుంది. లాహోర్లోని కృష్ణుడి ఆలయంలోపాటు వాల్మీకి ఆలయం కూడా ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉంది.