పాపం అమ్మ చనిపోయిందని తెలియక.. ఆకలేస్తోంది లే అమ్మా అంటూ ఐదేళ్ల చిన్నారి….

0
8

Woman Died In Railway Station:

  • బీహార్ రాష్ట్రంలోని భాగల్ పుర్ రైల్వే స్టేషన్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు తన తల్లి మరణించిందని తెలియక ఒడిలో నిద్రపోయాడు.
  • కొద్దిసేపటికి లేచి అమ్మా ఆకలేస్తోంది లే అమ్మా అంటూ తల్లిని లేపసాగాడు ఎంతకీ లేవకపోవటంతో అమ్మఅమ్మా అంటూ గట్టిగా రోదిస్తూ ఏడ్వసాగాడు.. రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకోవటంతో ప్రయాణీకులు చిన్నారిని దగ్గరకు తీసుకొని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
  • గత సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ప్లాట్ ఫాంపై కన్నతల్లి చనిపోయింది. ఆ విషయం తెలియని అయిదేళ్ల కుమారుడు అమ్మ మెడ చుట్టూ చేతులువేసి ఒడిలో నిద్రపోయాడు. కొద్దిసేపటికి లేచి అమ్మా ఆకలేస్తోంది అంటూ చెప్పినా అమ్మ లేవకపోవటంతో ఏడ్వటం మొదలు పెట్టాడు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో భాగల్ పుర రైల్వే పోలీసులు మహిళ మృతిచెందిన ప్రదేశానికి వచ్చి ఆమె మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు.
  • చిన్నారిని శిశు సంరక్షణ కేంద్రం అధికారులకు అప్పగించారు. అయితే మృతురాలి వివరాలు తెలుసుకోవడానికి తల్లీ కుమారుడి ఫొటోలను పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయినా ఎవరూ సంప్రదించక పోవటంతో గురువారం పోలీసులే ఆ మహిళలకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి మరణానికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తాయని అధికారులు తెలిపారు.
  • GRP ఇన్‌స్పెక్టర్ అరవింద్ కుమార్ ఈ విషయంపై మాట్లాడుతూ.. మహిళల కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు తెలుసుకొనేందుకు మృతదేహాన్ని 72 గంటల పాటు మార్చురీలో ఉంచడం జరిగిందని తెలిపారు. ఆమె మృతదేహాన్ని కలెక్ట్ చేసుకొనేందుకు ఎవరూ రాలేదని, దీంతో మేమే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here