పింగళ వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు

0
5
ap cm flag

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. అలాగే పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

మరోవైపు పింగళి వెంకయ్య స్వస్థలం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో జరిగే కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. అలాగే చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి ఆర్కే రోజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే, పింగళి వెంకయ్యపై రూపొందించిన ప్రత్యేక కవర్‌ను పోస్టల్‌ శాఖ ఆవిష్కరించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here