దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం ఈదర గ్రామం నిత్యం తమతో కలిసిమెలిసి తిరిగే ఆ ముగ్గురూ పిడుగుపాటుకు గురై ఒకేసారి కన్నుమూశారన్న సమా చారంతో ఆ పల్లె తల్లడిల్లింది. ఇంటికి ఆధారమైన వారు ఇక లేరని తెలిసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టా ముండ్లమూరు మండలం ఈదర గ్రామం సోమవారం శోకసంద్ర మైంది.. ఈ గ్రామానికి చెందిన పోతి రెడ్డి పిచ్చి రెడ్డి (54), జడ రామాం జమ్మ (32). ఆలకుంట రాములు (60) వ్యవసాయంతో పాటు పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎప్పటిలానే సోమవారం ఉదయం గ్రాసం మేతకు గేదెలను తోలుకెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో కురిసింది. వర్షం తగ్గిన వెంటనే వెళ్లవచ్చని సమీపం లోని పొలం గట్టుపై వేచి ఉండగా పెద్ద శబ్దంతో వారిపై పిడుగు పడింది. వెంటనే ముగ్గురూ నేలపై పడిపోయారు. వారికి సమీ పంలో ఉన్న మరో మహిళ వేమా వెంకాయమ్మ షాక్కు గుర య్యారు. ఆమె పెద్దగా కేకలు వేస్తూ గ్రామంలోకి పరుగులుతీసి విషయాన్ని తెలపడంతో అంతా చేరుకున్నారు. అప్పటికే ముగ్గురూ మృతి చెందినట్లు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ఉప తహసీల్దారు పుల్లారెడ్డి, సీనియర్ సహాయకులు శేషగిరిరావు సందర్శించి మృతుల వివరాలు నమోదు చేసుకున్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన టీడీపీ నాయకులు
ముండ్లమూరు మండలం ఈదర గ్రామంలో సోమవారం రాత్రి పిడుగు పడి చనిపోయిన మూడు కుటుంబాలను దర్శి మాజీ ఎమ్.ఎల్.ఏ నారపుశెట్టి పాపారావు పరామర్శించి కుటుంబానికి 10,000/- చొప్పున మూడు కుటుంబాలకి 30,000/- ఆర్ధిక సహాయం అందజేసారు.మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి మృత దేహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దర్శి నగరపంచాయితీ చైర్మన్ నారపుశెట్టి. పిచయ్య , టిడిపి ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహన కార్యదర్శి వల్లపూనేని. సుబ్బయ్య, తాళ్లూరు మండల నాయకులు ఇడమకంటి. శ్రీనివాసులరెడ్డి , ఈదర టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటరమణ, టిడిపి నాయకులు దాసరి. ఏడుకొండలు, తలారి. కోటయ్య, సంగు. చంద్ర, ఐ.టిడిపి యస్.వి.రామయ్య తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
