ఆమనగల్లు: ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) మృతి చెందారు. కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో చికిత్స పొందారు. రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఆయన్ను కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రానికి తరలించారు. ఆదివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం 5గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ట్రస్టు సభ్యులు తెలిపారు.తపత్రిజీ నిజామాబాద్‌లోని బోధన్‌లో జన్మించారు. గతంలో కర్నూలు జిల్లాలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. 2012లో కడ్తాల్ మండలం అన్మాసుపల్లి శివారులో ప్రపంచంలోనే అతిపెద్దదైన కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ నిర్మించారు. ఏటా ధ్యాన మహాచక్రం సంబరాలు డిసెంబర్ 18 నుంచి జనవరి 31 వరకు నిర్వహించి ధ్యానం విశిష్టతను వివరించారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియాను ఆయన గతంలో స్థాపించారు. ప్రపంచం ఐదు కోట్ల మంది శిష్యులు ఉన్నారు. వేల పిరమిడ్ లు నిర్మించారు. శాఖాహారం విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పారు. శ్వాస మీద ధ్యాస ధ్యాన ప్రపంచం గా మార్చాలన్నది ఆయన కోరిక.