పిల్లలందరూ ఆరోగ్య సూత్రాలు క్రమంతప్పక పాటించాలి

0
5

-బి కిరణ్మయి

పిల్లలందరూ ఆరోగ్య సూత్రాలు క్రమంతప్పక పాటించాలి చందలూరు ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి బి కిరణ్మయి తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమము సందర్భంగా దర్శి మండలం అన్ని అంగన్ వాడి కేంద్రాలు, మరియు ప్రాథమిక పాఠశాలలు, హైస్కూలు, జూనియర్ కళాశాలలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 10120 మంది పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు మింగించడం జరిగింది. ఈ సందర్భంగా చందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ బి కిరణ్మయి పాల్గొని మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల వయసుగల పిల్లల్లో నులిపురుగులు ఉండటం వలన వారి యొక్క శారీరక, మానసిక పెరుగుదల, మరియు చురుకుగా ఉండకపోవటం, జరుగుతుందని ఆమె తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మాలవిసర్జన చేయరాదు అని, మరుగుదొడ్డి ని ఉపయోగించాలి, చేతులను భోజనానికి ముందు, మాలవిసర్జన తరువాత శుభ్రంగా ఉంచుకోవాలి, చెప్పులను ధరించాలి, గోర్లను శుభ్రంగా పొట్టిగా కత్రించుకోవాలి అని ఆమె తెలిపారు. పండ్లను, కూరగాయను శుభ్రంగా కడిగి తీసుకోవాలి అని తెలిపారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొనుట ద్వారా నులిపురుగులను పిల్లలలో రాకుండా నివారించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ పి స్పందన, సి హెచ్ ఓ దయమని, హెచ్ ఈ ఓ అబుసలెం, హెల్త్ సూపర్వైజర్ జి శ్రీనివాస రావు, ల్యాబ్ టెక్నీషియన్ వసంత కుమార్, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here