పుష్పగుచ్చాన్ని విసురుగా కొట్టిన MP నాని

0
4
MP Nani throws flower Bouquet
MP Nani throws flower Bouquet

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన లో విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబుకు ఎయిర్‌పోర్టులో ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చం అందించారు. ఈ క్రమంలో ఎంపీ గల్లా జయదేవ్ గుచ్చాన్ని అధినేతకు అందివ్వాలని ఎంపీ కేశినేని నాని చేతికి ఇవ్వబోయారు. కానీ నాని పుష్పగుచ్చాన్ని విజయవాడ ఎంపీ విసురుగా కొట్టారు. దీంతో నాని తీరు చర్చనీయాంశమైంది. అంతేకాదు నాని చంద్రబాబుకు దూరంగా ఉన్నారు. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుపై నేరుగా అసహనం ప్రదర్శించారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు కేశినేని నిరాకరించడంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ బతిమిలాడిన ఏమాత్రం పట్టించుకోలేదు.కొద్దిరోజులుగా కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన ఎంపీ స్టిక్కర్‌ను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులకు నాని ఫిర్యాదు చేశారు. నేరుగా తమ్ముడు చిన్నిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో నాని తమ్ముడు మరింత దూకుడు పెంచారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను కలిశారు. తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో కొన్ని కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలోనే తమ్ముడిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహిస్తోందని నాని అసహనంతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల కేశినేని నాని కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుకకు చంద్రబాబుతో పాటూ లోకేష్‌లు హాజరయ్యారు. అప్పుడు కూడా నాని అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు.. కానీ ఇంతలోనే అధినేత ఢిల్లీ పర్యటనలో జరిగిన ఈ సన్నివేశం ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here