పొగాకు ఉత్పత్తులు,నిషేదిత సిగరేట్ లు స్వాధీనం..

0
8

బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్టూరు గ్రామంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయ దారులపై దాడులు నిర్వహించిన పర్చూరు SEB అధికారులు

నిషేధించిన పొగాకు ఉత్పత్తులను, గుట్కాలు మరియు గంజాయి వంటి వాటిని రవాణా చేసిన, విక్రయించిన, నిల్వ ఉంచిన ఉపేక్షించేది లేదు: జిల్లా ఎస్పీ

సుమారు రూ. 1,48,735/- విలువ చేసే 37,102 పౌచ్‌లు నిషేధిత పొగాకు ఉత్పత్తులు మరియు 9,200 నిషేదిత సిగరేట్ లు స్వాధీనం

బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్., మరియు జిల్లా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి అడిషనల్ ఎస్పీ P. మహేష్ గార్ల ఆదేశాల మేరకు, బాపట్ల SEB అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి G. నరసింహారావు పర్యవేక్షణలో రాబడిన సమాచారం మేరకు పర్చూరు SEB SHO అయిన M. యశోదర దేవి వారి సిబ్బందితో మార్టూరు గ్రామం మరియు మండలం నందు కొనిదెన రోడ్ లో మరియు సాయి బాబా గుడి దగ్గర సోదాలు నిర్వహించి నిషేధిత పొగాకు ఉత్పత్తులను కలిగి వున్న వేముల తిరుపతి రావు మరియు శ్రీరామ శివ శంకర్ అను వారిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి నిషేధిత పొగాకు ఉత్పత్తులు 37,102 పౌచ్‌లు మరియు 9,200 నిషేదిత సిగరేట్ లను స్వాధీనం చేసుకున్నారు వాటి మొత్తం విలువ రూ. 1,48,735/-.

అనంతరం ఇద్దరు ముద్దాయిలను మరియు అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత పొగాకు ఉత్పత్తులను మార్టూరు పోలీస్ వారికీ అప్పగించినారు.

బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్., మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు మరియు గంజాయి వంటి వాటిని రవాణా చేసిన, విక్రయించిన మరియు నిల్వ ఉంచిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించినారు. నిషేధిత పొగాక ఉత్పత్తుల గురించి మరియు గంజాయి గుట్కా వంటి వాటి విక్రయాలకు సంబంధించిన సమాచారము ఉన్న ఎడల పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ప్రజలను కోరినారు.

ఈ సోదాలు నిర్వహించి నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పర్చూరు SEB అధికారులను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here