పోలవరం ఆలస్యం చంద్రబాబు వల్లే..

0
8

సోమవారం అంబటి విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, పోలవరం ప్రాజెక్ట్‌ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

 పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తుతం భిన్న రకాలుగా చర్చ జరుగుతున్న వేళ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి, కాపర్ డ్యాం పాడైపోవడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలేనని అన్నారు. పోలవరంపై ఎల్లో మీడియా కూడా తప్పుడు ప్రచారం చేస్తోందని అంబటి ఆరోపించారు. సోమవారం ఆయన విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, పోలవరం ప్రాజెక్ట్‌ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

చంద్రబాబు నామినేషన్‌ పద్దతిలో కాంట్రాక్టర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పారదర్శకత పాటించామని అన్నారు. కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయా ఫ్రమ్‌ వాల్‌ ఎలా కట్టారని నిలదీశారు? డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించారని, కాసుల కోసం కక్కుర్తిపడి చారిత్రాత్మక తప్పిదం చేశారని ధ్వజమెత్తారు. ఆ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్ సీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

జగన్ ప్రభుత్వం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆగిపోయినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘చంద్రబాబు ట్రాన్స్ ట్రాయ్ అనే సంస్థను తప్పించి  నవయుగ అనే సంస్థకు పనులను అప్పగించారు. మేము రివర్స్ టెండర్ నిర్వహించి ప్రభుత్వానికి 12.6 శాతం నిధులను ఆదా చేశాం. కాఫర్ డ్యాం కట్టాక డయా ఫ్రం వాల్ కట్టాలి. కానీ చంద్రబాబు ఏం చేశారు? ఆయన ముందు చూపులేని ఫలితం వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

వైఎస్ఆర్ ప్రారంభించిన  పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం  చిత్తశుద్దితో తాము పనిచేస్తున్నామని అంబటి రాంబాబు  చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. పోలవరం భూ నిర్వాసితులకు పునరావాసం కోసం రూ. 1500 కోట్లు ఖర్చు చేసన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెక్రటరీలు, మంత్రులును మారిస్తే ప్రాజెక్టులు కొట్టుకుపోతాయా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here