ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం మండలం మురారిపల్లి గ్రామ చెరువు మలుపు వద్ద అదుపుతప్పి ఆర్టీసీ బస్సును బైకు ఢీ కొట్టడంతో బైకుపై ఉన్న నాగిరెడ్డి అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి బస్సును అదుపు చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. లేకుంటే ఎంతో మంది ప్రయాణికులకు గాయాలయ్యేయి. గాయపడిన నాగిరెడ్డిని యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై యర్రగొండపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.