ప్రకాశం జిల్లా లో నారీభేరి కార్యక్రమం

0
1

ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ మెప్మా కార్యాలయం నందు నారీభేరి కార్యక్రమాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఒంగోలు నుంచి వచ్చిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శివకోటయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ నారీభేరి కార్యక్రమం లో భాగంగా స్వయం సహాయక సంఘాలకు 20 లక్షల వరకు రుణాల పరిమితిని పెంచడం జరిగిందని తెలిపారు. గిద్దలూరు బ్యాంకు మేనేజర్ షేక్ షాహిర్ మాట్లాడుతూ అన్ని బ్యాంకుల్లో కెల్లా యూనియన్ బ్యాంకిలోనే అతి తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తున్నామని కావున స్వయం సహాయక మహిళలు ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని తిరిగి చెల్లింపు సక్రమంగా చేయాలని పిలుపునిచ్చారు.
మెప్మా సిబ్బంది వేణుగోపాల్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘ మహిళలకు సున్నా వడ్డీకి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తుందని సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే సున్నా వడ్డీకి రుణాలు అందజేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ షాహీర్, సబ్ మేనేజర్ పవన్, ఫీల్డ్ ఆఫీసర్ ఆర్.మణి మరియు మెప్మా రిసోర్స్ పర్సన్ లు ఫాతిమా, రమాదేవి, రవణమ్మ, విమలా మార్తమ్మ, గౌసియా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here