ప్రగతి నిరోధకుడు ముఖ్యమంత్రి జగన్

0
2
tulasireddy

తక్షణమే మెస్ చార్జీలు పెంచాలి. అగ్రిగోల్డ్ బాధితులకు బకాయిలు చెల్లించాలి . ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి
ముఖ్యమంత్రి జగన్ ప్రగతి నిరోధకుడుగా మారారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయాల్సిన రూ.1798 కోట్లు విడుదల చేయని కారణంగా రాష్ట్రంలో రూ.1.33 లక్షల కోట్లు విలువచేసే కేంద్ర ప్రాజెక్టు లు ఆగిపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఇందులో రైల్వే ప్రాజెక్టు లు, రహదారులు, గృహనిర్మాణం, జల్ జీవన్ మిషన్ పనులు, సూక్ష్మసాగు నీటి పనులు, ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన తదితర పథకాలు ఉన్నాయని అన్నారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
మెస్ చార్జీలు పెంచాలి : హాస్టళ్లలో 5 సంత్సరాలుగా మెస్ చార్జీలు పెంచలేదని, ఈ లోపు వంట గ్యాస్, కంది పప్పు, నూనెలు తదితర వస్తువుల ధరలు భారీగా పెరిగాయన్నారు. అందువల్ల విధ్యార్థులకు కడుపు నిండా తిండి పెట్టలేని దుస్థితి నెలకొందని, వెంటనే మెస్ చార్జీలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంకా 903121 మంది అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 3039 కోట్లు చెల్లించాలని, వెంటనే వాటిని విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే : నిత్యావసర వస్తువుల ధరల పెంపు, నిరుద్యోగ సమస్యను పెంచడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం పోటీ పడుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు అసాధారణ రీతిలో పెరిగాయన్నారు. చిన్నపిల్లలు తాగే పాలమీద, బడిపిల్లలు వాడే పెన్సిళ్లు, రబ్బర్ల మీద కూడా జీఎస్టీ విధించారని ఆయన విమర్శించారు. జగన్ మూడేళ్ల పాలనలో ఇసుక, మద్యం, సిమెంట్, నూనెలు, పప్పు దినుసుల ధరలు, కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్టీలు అసాధారణ రీతిలో పెరిగాయని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here