ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్న -సంజయ్

0
3
bandi sanjay

 స్వరాష్ట్రం సిద్ధించినా.. పేదల కష్టాలు తీరలేదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా.. కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నియంత, కుటుంబ, అవినీతి పాలనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో కలిసి రచ్చ బండ కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్.భూములు, ఇళ్లు కోల్పోయిన తమను సర్కారు పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బండి సంజయ్ ని కోరారు. ముంపు బాధితుల గోస విన్న సంజయ్.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు బాధితులకు అన్యాయం చేయడం ఏంటని నిలదీశారు. బీజేపీ ఉండగా ప్రజలకు అన్యాయం జరగబోదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బతుకుదెరువు కోసం వలస వెళ్లిన పేదల ఉసురు తీయొద్దని ప్రభుత్వానికి సూచించారు.పేద ప్రజల కోసం కొట్లాడుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. తాము ఓట్ల కోసం రాలేదని.. కేసీఆర్ లాగా ఓట్ల కోసం తెలంగాణ ప్రజలను బీజేపీ మభ్యపెట్టబోదని స్పష్టం చేశారు. ఉన్న ఊరు, తాతముత్తాతల కాలం నుంచి ఉంటున్న ఇంటిని వదిలి వెళుతున్న వారికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని కామెంట్ చేశారు. బండి పాదయాత్రలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. బస్వాపూర్ పాఠశాల విద్యార్థులతో బండి సంజయ్ ముచ్చటించారు. ఈ నేపథ్యంలో బండితో చేయికలిపేందుకు విద్యార్థులు ఉత్సాహం ప్రదర్శించారు. అందరితో చేయికలుపుతూ.. పలకరిస్తూ.. చిన్నారులను హృదయానికి హత్తుకుంటూ బండి సంజయ్ ముందుకు సాగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here