ప్రధానికి ఆరేళ్ల చిన్నారి లేఖ…

0
4

ఉత్తరప్రదేశ్‌లోని ఓ బాలిక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. తన చిన్న చేతులతో పెరిగిన ధరలతో వచ్చిన కష్టాన్ని ఆ లేఖలో తెలియజేసింది. పెన్సిల్, రబ్బర్, మ్యాగీ ధరలు పెరగడానికి కారణం మీరేనని ఆ లేఖలో పేర్కొంది. ఈ లేఖను చిన్నారి తండ్రి విశాల్ దూబే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

  • తల్లి కొట్టడంతో మనస్తాపానికి గురైన కృతి దూబే
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ

ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఆరేళ్ల బాలిక ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. అదీ కూడా పెరుగుతున్న ధరల వల్ల కలుగుతున్న కష్టం గురించి తెలియజేస్తూ లెటర్ రాసింది. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాను చుట్టేస్తుంది. పెన్సిల్, రబ్బర్ ధరలు కూడా పెరిగాయని, మ్యాగీ రేటు కూడా విపరీతంగా పెరిగిందని ఆ లేఖలో ప్రస్తావించింది. ధరలు పెరగడం వల్ల తన తల్లి తనను కొట్టిందని లెటర్‌లో పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ జిల్లాలోని చిబ్రమౌ పట్టణంలోని కృతి దూబే అనే అమ్మాయి.. నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

ఆ లేఖలో “నా పేరు కృతి దూబే. నేను ఒకటో తరగతి చదువుతున్నాను. మోదీ గారూ మీరు నా పెన్సిల్, రబ్బరు ధరలు విపరీతంగా పెరగడానికి కారణమయ్యారు. మ్యాగీ ధర కూడా పెరిగింది. ఇప్పుడు మా అమ్మ నన్ను పెన్సిల్ అడిగినందుకు కొట్టింది. ఇప్పుడు నేనేం చేయాలి..? వేరే పిల్లలు నా పెన్సిల్‌ని దొంగిలించారు.” అని పేర్కొంది. హిందీలో రాసిన ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు దానిపై తమదైన శైలీలో స్పందిస్తున్నారు.

అయితే ఈ లేఖను చిన్నా తండ్రి విశాల్ దూబే (లాయర్) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఇది నా కూతురు మనస్సులో మాట (మన్‌కీ బాత్).” అంటూ షేర్ చేశారు. ఈ మధ్య స్కూల్లో పెన్సిల్ పోగొట్టుకున్నప్పుడు తల్లి ఆమెను తిట్టిందని, దాంతో తన కూతురు మనస్తాపానికి గురైందని విశాల్ దూబే తెలియజేశారు. అయితే చిన్నారి లేఖ గురించి చిబ్రామౌ ఎస్‌డీఎం అశోక్ కుమార్ స్పందించారు. “నేను ఆ బాలికకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె లేఖను సంబంధిత అధికారులకు చేరేలా చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను” అని విలేకరులతో చెప్పారు.

అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చిన్నారి లేఖ రాయడం ఇదేం కొత్తం కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. గత ఏడాది జమ్మూ కశ్మీర్‌లోని ఓ ఆరేళ్ల బాలిక ఆన్‌లైన్ క్లాసుల వల్ల ఇబ్బందిగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె హోం వర్క్, క్లాసుల గురించి కూడా ప్రస్తావించింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించారు. సంబంధిత స్కూల్‌పై చర్యలు తీసుకున్నారు. దానిపై వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here