ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా రాఖీలు.. 

0
5

 దేశంలో ఈ పండుగ ఎప్పుడు మొదలైందో ఖచ్చితంగా తెలియదు కానీ, పురణాల్లోనూ దీని గురించి ప్రస్తావన ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 12న జరగనుండగా.. యూపీలోని బృందావన్‌కు చెందిన వితంతువులు ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా రాఖీలను తయారుచేశారు.

రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ఉత్తర్ ప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన వితంతువులు ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా రాఖీలను తయారుచేసి ఆయనపై తమ అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటలతో అందమైన వివిధ డిజైన్లతో రూపొందించిన ఈ రాఖీలను ప్రధాని నరేంద్ర మోదీకి పంపనున్నారు. ఈ వితంతువులతో కలిసి దశాబ్దానికిపై పనిచేస్తున్న సులభ్ స్వచ్ఛంద సంస్థ.. వివిధ నైపుణ్యాలను నేర్చుకునేందుకు శిక్షణనిస్తూ సహాయం చేస్తోంది. వారణాసి, బృందావన్‌, ఉత్తరాఖండ్‌లకు చెందిన వితంతువుల కోసం గత పదేళ్లుగా ఈ సంస్థ పనిచేస్తూనే ఉంది.

‘‘వారణాసి, బృందావన్‌, ఉత్తరాఖండ్‌లకు చెందిన వితంతువుల కోసం గత పదేళ్లుగా మా సంస్థ పనిచేస్తోంది.. రాఖీలు తయారుచేయడంతో పాటు అనేక నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తోంది’’ అని సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ సంస్థ ఉపాధ్యక్షుడు తెలిపారు. వారణాసిలోని ఆశ్రమాల్లో నివసిస్తున్న ఈ మహిళలు కొన్నాళ్లుగా ప్రధానికి రాఖీలు కడుతున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత రెండేళ్ల నుంచి ప్రధానిని వ్యక్తిగతంగా కలవలేకపోయారు.

బృందావన్‌లో దాదాపు 10,000 మంది వితంతువులు నివసిస్తుండగా.. వారిలో ఎక్కువ మంది పేదలు, నిరక్షరాస్యులు. సాధారణంగా వారి కుటుంబాలకు దూరంగా ఉత్తర భారతదేశంలోని ఈ పవిత్ర నగరానికి తమ మార్గాన్ని కనుగొంటారు. ప్రముఖ సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ స్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ సంస్థ ఈ మహిళల విముక్తి కోసం పనిచేస్తుంది. సమాజం ఈసడింపులకు గురయ్యే వారికి మంచి జీవితాన్ని గడపడానికి సహాయం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here