దోర్నాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు.
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కృషి.
మంత్రి వినతికి స్పందించి మంజూరు చేసిన సీఎం.
ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలకు ప్రభుత్వం డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిగ్రీ కళాశాల ఆవశ్యకతను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సురేష్ గారి విన్నపానికి స్పందించిన సీఎం డిగ్రీ కళాశాల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, వెంటనే అధికారులు కళాశాల మంజూరు ఉత్తర్వులు ఇవ్వటం చకచకా జరిగిపోయాయి. కళాశాల మంజూరు చేసిన సీఎంకు మంత్రి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాంతానికి కళాశాల మంజూరుకు కృషి చేసిన మంత్రి సురేష్ కు దోర్నాల తో పాటు యర్రగొండపాలెం నియోజకవర్గం లోని ప్రజలు అభినందనలు తెలిపారు.