ప్రభుత్వ సలహాదారువా… తాడేపల్లి గుమాస్తావా?

0
3
atchannaidu kinjarapu

కేంద్రం ఆహ్వానం మేరకు చంద్రబాబు డిల్లీ వెళ్లారు!
మీకు పడుకున్నా, లేచినా చంద్రబాబే గుర్తుకువస్తున్నాడు!
వైసిపికి ఇంటింటా కౌంట్ డౌన్ మొదలైంది!
త్వరలో తాడేపల్లి ప్యాలెస్ కు టులెట్ బోర్డు ఖాయం
అప్పులు, కేసులపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేదు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
విశ్వవ్యాప్తంగా తెలుగువారి పరువుతీసిన వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ నోరుపారేసుకోవడం వైసిపి నేతలకు అలవాటుగా మారింది. కేంద్రప్రభుత్వ ఆహ్వానంపై అజాదీ కా అమృత్ మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు డిల్లీ వెళ్తే వైసిపి నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మీకు మాదిరి కేసుల మాఫీ కోసం చంద్రబాబునాయడు ప్రధానిని కలవలేదు. దేశభక్తికి సంబంధించిన అంశాలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసిపి దిగజారుడుతనానికి నిదర్శనం. స్వప్రయోజనాల కోసం కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కును తాకట్టుపెట్టిన చరిత్ర వైసిపి నేతలదే. 25 ఎంపిలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా ఏమైంది? దోచుకున్న లక్షకోట్ల తాలూకు సిబిఐ, ఈడి కేసులను బయటపడటం, అప్పుల కోసం కేంద్రం వద్ద సాగిలపడటం తప్ప వైసిపికి మరొక అంశంపై శ్రద్ధలేదు. బ్రిటిష్ పాలకులకు వారసుల్లా వ్యవహరిస్తున్న వైసిపి నేతలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
సజ్జల వైసిపి సలహాదారుడా?
ప్రభుత్వ సలహాదారుగా ప్రతినెలా లక్షల్లో జీతం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి మూడేళ్లుగా దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేమిటి? ఏ మాత్రం నైతిక విలువలు ఉంటే ప్రజలసొమ్మును జీతంగా తీసుకుంటున్న నువ్వు ఏవిధంగా వైసిపి కార్యాలయంలో ఏవిధంగా ప్రతిపక్షంపై విమర్శలు చేస్తారా? రాజ్యాంగేతరశక్తిగా మారి మంత్రులను డమ్మీలుగా మార్చి గత మూడేళ్లుగా వ్యవస్థలను నిర్వీర్యం చేసిన మీరు చంద్రబాబుగారి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.
ముందు ప్రజలకు సమాధానం చెప్పండి!
వైసిపి నేతలు పోటీపడి పగటి కలలు కంటున్నారు. 2024లో అధికారంలోకి వస్తామన్న మీ కల కలగానే మిగిలిపోతుంది. సజ్జల, విజయసాయిరెడ్డి వంటివారు ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే ఎన్నికల్లో మీరు చిత్తుచిత్తుగా ఓడటం ఖాయం. గడపగడపకు ప్రభుత్వం జనం ముందుకు వెళ్తున్న వైసిపి ప్రజాప్రతినిధులపై జనం చేస్తున్న తిరుగుబాటే మీ పతనం మొదలైందనడానికి సంకేతం. ఏ మాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా ముందు ఇంటింటా మిమ్మల్ని చొక్కాపట్టుకొని నిలదీస్తున్న ప్రజలకు సమాధానం చెప్పి వారి సమస్యలను పరిష్కరించండి. సమస్యలకు పరిష్కారం ఎదురుదాడి, డైవర్షన్ రాజకీయాలు కాదన్న వాస్తవాన్ని వైసిపి నేతలు గుర్తిస్తే మంచిది. తాడేపల్లి ప్యాలెస్ కు టులెట్ బోర్డు పెట్టుకునే రోజు దగ్గర్లోనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here