పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతుకోసింది ఓ మహిళ. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసి హత్య చేసింది ఓ మహిళ. ఆ తర్వాత మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి తరలిస్తూ పోలీసులకు చిక్కింది.
అనంతరం.. ఆ మృతదేహాన్ని పడేసేందుకు సూట్‌కేస్‌లో తరలిస్తూ పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని సంభల్ ప్రాంతానికి చెందిన ఫిరోజ్‌గా గుర్తించారు.
ఇదీ జరిగింది
ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ భర్తను విడిచిపెట్టి నాలుగేళ్లుగా ఫిరోజ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని ఫిరోజ్‌ను కోరగా అందుకు అతను నిరాకరించాడు. తర్వాత కూడా పదేపదే ఫిరోజ్‌పై సదరు మహిళ ఒత్తిడి తెచ్చింది. అతను ఒప్పుకోక పోవడంతో కక్ష పెంచుకుని పక్కా ప్లాన్ ప్రకారం అతడ్ని హతమార్చింది.
రేజర్‌తో
రేజర్‌తో ఫిరోజ్ గొంతు కోసి చంపింది నిందితురాలు. ఆ తర్వాత మృతదేహాన్ని పడేసేందుకు పెద్ద సూట్‌కేసు కొనుగోలు చేసింది. సూట్‌కేసులో మృతదేహాన్ని పెట్టి కారులో తరలిస్తుండగా పోలీసులకు చిక్కింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
” తనను పెళ్లి చేసుకుంటానని చాలా సార్లు ఫిరోజ్ హామీ ఇచ్చాడని నిందితురాలు పేర్కొంది. తాను భర్తకు కూడా డైవర్స్ ఇచ్చి ఫిరోజ్‌తో కలిసి నాలుగేళ్లుగా సహజీవననం చేస్తున్నట్లు పేర్కొంది. ఫిరోజ్ పెళ్లికి అంగీకరించకపోవడంతో హత్య చేసినట్లు దర్యాప్తులో ఒప్పుకుంది. “