ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఇల్లాలు

0
3
murder

కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాకు చెందిన దేవేందర్‌‌కు భార్య పార్వతి, తొమ్మిదేళ్ల కుమారుడు శివ ఉన్నారు. దేవేందర్ 40 రోజుల క్రితం సిర్పూరు(టి) మండలంలోని అటవీశాఖ ప్లాంటేషన్‌లో కూలీ పనుల కోసం కుటుంబంతో సహా వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో పార్వతికి స్థానికంగా ఉండే రామ్‌లాల్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది.ఆదివారం రాత్రి ఇంటికొచ్చేసరికి భార్య పార్వతి, రామ్‌లాల్‌లో ఏకాంతంగా ఉండటం చూసి దేవేందర్ షాకయ్యాడు. ఇదేం పనంటూ భార్యను మందలిస్తుండగానే పార్వతి ప్రియుడితో కలిసి అతడి తలపై కర్రతో కొట్టింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న దేవేందర్‌ని ఇద్దరూ గొంతు నులిమి చంపేసి హత్య చేశారు. అనంతరం పార్వతి తనకు అన్న వరుసయ్యే రామ్‌లాల్ సహకారంతో మృతదేహాన్ని ఇటిక్యాల పహాడ్‌ గ్రామ సమీపంలోని రైల్వేట్రాక్‌ వద్దకు తీసుకెళ్లి పూడ్చిపెట్టింది. సోమవారం రామ్‌‌లాల్, పార్వతి ఏమీ ఎరుగనట్లు కూలి పనికి వెళ్లిపోయారు.అయితే సాయంత్రం వేళ మద్యం తాగిన మైకంలో ఆ ఇద్దరూ తాము చేసిన దారుణాన్ని తోటి కూలీలకు చెప్పేశారు. కూలీలు అటవీ అధికారులకు ఈ విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం బీట్‌ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. సిర్పూర్(టి) ప్రభుత్వాసుపత్రి డాక్టర్ చెన్నకేశవులు పోస్టుమార్టం చేసిన అనంతరం శవాన్ని అక్కడే తిరిగి పూడ్చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేశాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here