ప్రేమించడం లేదని మహిళ కిడ్నాప్.

0
9

తమిళనాడులోని ఓ మహిళను 15 మంది కిడ్నాప్ చేశారు. కొంతమంది మగవాళ్లు గుంపుగా ఇంటి ముందు చేరి… తలుపును పగలగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించి.. కొన్ని క్షణాల తర్వాత మహిళను బయటకు లాగారు. వారంతా కత్తులు, ఇతర ఆయుధాలతో కుటుంబ సభ్యులను బెదిరించారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేసి అదేరోజు రాత్రి మహిళను రక్షించారు. మైలాడుతురై జిల్లాలో ఇది జరిగింది. అయితే దీని వెనుక పెద్ద కథ ఉంది. ఆ యువతి ప్రేమించడం లేదని ఓ వ్యక్తి స్కెచ్ వేసి ఇలా చేశాడు.తంజావూరుకు చెందిన విఘ్నేశ్వరన్ (34) అనే వ్యక్తి 23 ఏళ్ల యువతి కొంతకాలం ప్రేమించుకున్నారు.
అయితే విఘ్నేశ్వరన్ ప్రవర్తన నచ్చక… ఆ మహిళ అతడిని దూరం పెట్టింది. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసేవాడు. ఆ వేధింపులపై ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు విఘ్నేశ్వరన్ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ ఆ యువతి వెంటపడనని ఓ లేఖను కూడా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే అప్పుడు ఆమె ఎలాగాలో తప్పించుకుని.. పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి కోసం గాలిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆ యువకుడు మళ్లీ ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. ఆగస్ట్ రెండో తేదీన
తన స్నేహితులతో కలిసి యువతి ఇంటికి వచ్చిన విఘ్నేశ్వరన్.. తలుపులు పగులగొట్టి ఆమెను తీసుకెళ్లిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. విల్లుపురం జిల్లాలోని విక్రాన్వాడి టోల్గేట్ వద్ద అతడిని పట్టుకున్నారు. బాధితురాలిని కాపాడారు. అయితే ఈ కిడ్నాప్ దృశ్యాలు ఇంటి బయట వచ్చిన సీసీ టీవీలో అపహరణ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దాదాపు 15 మంది మగవాళ్లు తలుపును పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here