ఫరీద్‌కోట్‌ Jailలో విచ్చలవిడిగా డ్రగ్స్

0
1

పంజాబ్ రాష్ట్రంలో జైళ్లకు సంబంధించి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఫరీద్‌కోట్‌లోని సెంట్రల్ మోడ్రన్ జైల్లో ఖైదీలకు విచ్చలవిడిగా డ్రగ్స్ అందుతున్నట్టు తెలిసింది. వేలాది సంఖ్యలో ఖైదీలు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు తేలింది. అందులో మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. 2,333 మంది ఖైదీలకు ఆరోగ్య శాఖ డోప్‌ టెస్ట్‌ నిర్వహించింది. వీరిలో 1,064 మంది ఖైదీల రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. 1,269 మంది ఖైదీల రిపోర్టు నెగెటివ్‌గా తేలింది. ప్రభుత్వం ఆదేశం మేరకు రెండు రోజుల పాటు టెస్ట్‌లు నిర్వహించినట్టు సివిల్ సర్జన్ డాక్టర్ సంజయ్ కపూర్ తెలిపారు.

అలాగే జైల్లో 155 మంది మహిళా ఖైదీలు ఉండగా.. వారిలోనూ కొందరు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. అదేవిధంగా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిన వారిలో 721 మంది ఖైదీలు డి అడిక్షన్ కోసం బ్యూప్రెనార్ఫిన్ మాత్రలు, నొప్పి నివారణలు, ట్రామాడాల్‌లకు బానిసలుగా తేలింది. అయితే పరీక్షల్లో దొరికినవారిని కూడా డ్రగ్స్‌ మాన్పించే కేంద్రంలో చికిత్స అందిస్తామని డాక్టర్ సంజయ్ కపూర్ తెలిపారు. నిజానికి ఖైదీల్లో డ్రగ్స్ వినియోగాన్ని మాన్పించేందుకు పంజాబ్ ప్రభుత్వం జైళ్లలో కొన్ని కేంద్రాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంతమంది ఖైదీలు.. మాదక ద్రవ్యాలు వాడుతున్నప్పుడు ఆ కేంద్రం ఉపయోగమేమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా పంజాబ్‌లోని 14 జైళ్లు సబ్ జైళ్లలో ఇప్పటివరకు ఎనిమిది వేల మందికిపైగా ఖైదీలను పరీక్షించారు. అందులో 42 శాతం మంది ఖైదీలకు డోప్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. అమృత్‌సర్‌లో 1900 మంది ఖైదీల్లో 900 మంది డ్రగ్స్‌కు బానిలసలయ్యారని తేలింది. భటిండా సెంట్రల్ జైల్లో 1673 మంది, గురుదాస్‌పూర్‌లో 997 మంది ఖైదీలకు గాను 425 మంది ఖైదీల డోప్ టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. అలాగే సంగ్రూర్ జైల్లో 966 మంది ఖైదీల్లో 340 మంది డ్రగ్స్ బానిసలు దొరికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here