ఫేక్‌ సర్టిఫికెట్‌తో జాబ్‌ కొట్టాలనుకున్నాడు..చివరికి జీవితమే నాశనమైంది.

0
5
fake certificate

అభిషేక్‌ అనే ఓ యువకుడు నకిలీ సర్టిఫికెట్లు పెట్టి హైదరాబాద్‌- గచ్చిబౌలిలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం పొందాలనుకున్నాడు.. ఫేక్‌ సర్టిఫికెట్లతో కంపెనీలో ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నించాడు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ యూనివర్సిటీ పేరుతో సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ.. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. జైలుకు వెళ్లాల్సి వచ్చింది.జాబ్ ప్రాసెస్ లో భాగంగా కంపెనీ అతడి సర్టిఫికేట్లను తనిఖీ చేసింది. ఆ యువకుడు సమర్పించినవి నకిలీ సర్టిఫికెట్లుగా గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు అభిషేక్‌తో పాటు అతడికి ఫేక్ సర్టిఫికెట్లు ఇప్పించిన ఇద్దరు దళారులను కూడా అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యువతీ యువకులు దళారుల మాటలు నమ్మి కెరీర్ నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here