ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కేవలం అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన బంధువుతో కలసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెకు త్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ప్రకటించాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బంధువు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో అదనపు కట్నం కోసం ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. తను అడిగిన విధంగా ఇంకా కట్నం తేలేదనే కోపంతో, ఆక్రోశంతో భార్యపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బంధువులతో కలసి భార్యపై అత్యాచారం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడైన లక్నోకు చెందిన మహ్మద్ అద్నాన్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతనితో పాటు పరారీలో ఉన్న అతని బంధువుపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వారు తెలిపారు.
తన భర్త అదనపు కట్నం డిమాండ్ చేసేవాడని, దాని కోసం తనను విపరీతంగా కొట్టేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనను తరచూ వేధించడంతో ఆ మహిళ తన తల్లి ఇంటికి వెళ్లిపోయి.. అక్కడే ఉంటుందని పోలీసు సూపరింటెండెంట్ ఆకాష్ తోమర్ తెలిపారు. అయితే మంగళవారం అద్నాన్, అతని బంధువుతో కలసి తన అత్తమామల ఇంటికి వెళ్లి ఒంటరిగా ఉన్న భార్యపై అత్యాచారం చేశారని తోమర్ చెప్పారు. తర్వాత ఆమెను కొట్టి త్రిపుల్ తలాక్ చెప్పి చట్టవిరుద్ధంగా విడాకులు ప్రకటించాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పరారీలో ఉన్న బంధువును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.