బుడగ జంగాల కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

0
55
బుడగ జంగాల కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో వార్డు కౌన్సిలర్ సుచరిత కొమురయ్య, కమిషనర్ శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. బుడగ జంగాల అభివృద్ధికి పాటుపడుతామన్నారు. గ్రామ కంఠంలోని భూమిలో బుడగ జంగాల కమ్యూనిటీ భవనం నిర్మించేందుకు 2018 లోనే తీర్మాణించామన్నారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్ లకు కౌన్సిలర్ సుచరిత కొమురయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతో వార్డును మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చైర్మన్ సోమిరెడ్డి.. 17వ వార్డు కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, నాగరాజు, టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, వెలిమల అధ్యక్షుడు సత్యనారాయణ, అల్లావుద్దీన్, అక్బర్ పాషా, శ్రీరాములు, బుడగ జంగల జిల్లా అధ్యక్షుడు తో పాటు బుడగ జంగాల కమ్యూనిటీ పెద్దలు మాణిక్యం, వెంకటయ్య,శ్రీరాములు, కిష్టయ్య, స్వామి, ఎల్లయ్య, దయాకర్ తదితరులు పెద్దలు మరియు యువత పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here