బతుకు చిత్రం పోస్టర్ ఆవిష్కరణ..

0
3

అంతర్జాతీయ సాంస్కృతిక సామాజిక సాహిత్య సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక , డాక్టర్ బోయి భీమన్న సాహితీ నిధి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా శతాధిక కవి సమ్మేళనం హైదరాబాద్ లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలోని నందమూరి తారక రామారావు కళామందిరంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 222 మంది కవయిత్రులు రచించిన” ఆమె” కవితా సంకలనాన్ని ముఖ్య అతిథులు తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, శ్రీమతి డాక్టర్ బోయి హైమావతి భీమన్న, శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆవిష్కరించారు. అనంతరం శ్రీశ్రీ కళావేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి జి. ఈశ్వరీభూషణం కలం నుండి రాబోతున్న యానాదుల బతుకు చిత్రం బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ప్రపంచం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నప్పటికీ మహిళ వివక్షత ఇంకా ఎదుర్కొంటూనే ఉందని, స్త్రీ మనుగడ లేనిదే సమాజం లేదని, స్త్రీ గొప్పతనాన్ని కొనియాడారు. శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ అంతర్జాతీయ చైర్మన్ మాట్లాడుతూ సామాజిక చైతన్యం తెచ్చే దిశగా కవిత్వం రావాలని, అలాంటి కవిత్వం నిలబడుతుందని మహిళ ఇంకా శక్తివంతంగా ఎదిగి మంచి సాహిత్యాన్ని అందించాలన్నారు. డాక్టర్ బోయి హైమావతి భీమన్న మాట్లాడుతూ తెలుగు వైభవాన్ని చాటుతూ 222 మంది కవయిత్రులను ఒకే వేదికపైకి తెచ్చిన శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ ప్రతాప్ ను, జాతీయ కమిటీ ని అభినందించారు. జాతీయ కన్వీనర్ శ్రీమతి కొల్లి రమావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈశ్వరీభూషణంను ఘనంగా సత్కరించారు. అనంతరం కవితా గానం చేసిన 222 మంది కవయిత్రులను శాలువా , మెమెంటో, పూలదండలతో సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here